UP: పెళ్లి చేసుకోవాలంటే పీఎం పేరు తెలియాల్సిందేనా.. !
పెళ్లి చేసుకోవాలంటే ప్రధాన మంత్రి పేరు తెలిసి ఉండాలా.. అంటే అవును అంటుంది ఓ అమ్మాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లోని నాసిర్‌పూర్ గ్రామంలో ఓ వింత ఘటన జరిగింది. వరుడికి ప్రధాన మంత్రి తెలియకపోవడంతో వధువు తన పెళ్లిని రద్దు చేసుకుంది. అంతే కాదు అక్కడే ఉన్న వరుడి తమ్ముడిని వివాహం చేసుకుంది. నసీర్‌పూర్ గ్రామానికి చెందిన శివశంకర్‌రామ్‌కు కరందలోని బసంత్ పట్టిలో నివాసముంటున్న యువతితో వివాహం జరగాల్సి ఉంది.
హిందూ ఆచారాల ప్రకారం జూన్ 11వ తేదీని శుభ ముహూర్తాల ప్రకారం వివాహం జరిపించాలని నిర్ణయించారు. కాగా జూన్ 11న శివశంకర్ పెళ్లి ఊరేగింపుతో కాబోయే భార్య ఇంటికి చేరుకున్నాడు. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. ఉదయం జరిగిన ఖిచ్డీ వేడుకలో పెళ్లికొడుకు మరదల్లు, బావమరుదులతో సరదాగా గడిపాడు. ఈ క్రమంలో శివశంకర్ ను మరదలు ఓ ప్రశ్న అడిగింది. మన దేశ ప్రధాని ఎవరంటూ ప్రశ్నించింది.

అయితే మరదలి ప్రశ్నకు శివశంకర్ సమాధానం చెప్పలేకోపోయాడు. దీంతో అక్కడున్నవారంతా.. శివశంకర్ ను హేళన చేశారు. ప్రధాని పేరు తెలియకుంటే ఎలా అంటూ అవమానించారు. దీన్ని తీవ్ర అవమానంగా భావించిన అతని భార్య.. శివశంకర్ తమ్ముడైన అనంత్ ను అక్కడికక్కడే వివాహం చేసుకుంది. అయితే తుఫాకీ చూపించి అనంత్ ను పెళ్లి చేసుకుందని అతని తండ్రి ఆరోపించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
తమకు ఏ పార్టీ నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదని సైద్‌పూర్ కొత్వాల్ వందనా సింగ్ తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధాని పేరు వెల్లడించనందుకు తన పెళ్లి ఆగిపోయిందని ఓ యువకుడు స్టేషన్ కు వచ్చారడి చెప్పారు. దీంతో కుటుంబసభ్యులను పిలిపించి యువకుడిని వెనక్కి పంపించామన్నారు. ఈ విషయంలో రాతపూర్వకంగా ఫిర్యాదు అందిన తర్వాత జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకుంటామని కొత్వాల్ సింగ్ తెలిపారు.












Click it and Unblock the Notifications