UP Police: యూపీలో దారుణం.. మహిళలపై మగ పోలీసుల దాష్టీకం.. వీడియో వైరల్..

ఉత్తరప్రదేశ్ పోలీసులు మహిళలపై లాఠీలు ఝులిపించారు. కింద పడేసి మరి కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్ జిల్లా జలాల్‌పూర్‌లో జరిగింది. ఇటీవల ఆ ప్రాంతంలో బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై మహిళలు నిరసన వ్యక్తం చేశారు. విగ్రహం ధ్వంసం చేసిన ప్రాంతానికి చేరుకున్న కొంత మంది మహిళలు.. ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు.

ఈ క్రమంలో మగ పోలీసులు మహిళలను దారుణంగా కొట్టారు. అయితే మహిళలను మగ పోలీసులు కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై పోలీసులపై తీవ్ర విమర్శాలు వెల్లువెత్తుతున్నాయి. ఆందోళనకారులలో కొందరు.. సీనియర్ అధికారితో సహా పోలీసులపై రాళ్లు రువ్వారని పోలీసులు తెలిపారు. "గందరగోళం సమయంలో, కొంతమంది నిరసనకారులు పోలీసు కారుపై దాడి చేసి ధ్వంసం చేశారు" అని అంబేద్కర్ నగర్ పోలీసు అధికారి అజిత్ కుమార్ సిన్హా చెప్పారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు "మైనర్ ఫోర్స్" ఉపయోగించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.

 Police misbehaved with protesting women in UP. The male policemen lathi-charged the protesting women.

మగ పోలీసులు మహిళలను కొట్టడడంపై ప్రతి పక్షాలు తీవ్రంగా స్పందించాయి. యోగి అధిత్యనాథ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి. అలాగే మహిళలపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని.. ఆందోళన చేస్తామని హెచ్చరించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+