IT Returns: ఐటీ రిటర్న్ ల దాఖలుకు తేదీ పొడిగిస్తున్నారా ? కేంద్రం క్లారిటీ..!

2023-24 ఆర్దిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ ల దాఖలుకు కేంద్రం జూలై 31 వరకూ గడువు ఇచ్చింది. కానీ సర్వర్ సమస్యల కారణంగా రిటర్న్ ల పైలింగ్ అంతకంతకూ ఆలస్యమవుతోంది. దీంతో రిటర్న్ లు ఫైల్ చేసే వాళ్లు గగ్గోలు పెడుతున్నారు. కేంద్రం రిటర్న్ ల ఫైలింగ్ గడువు పెంచాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా దీనిపై సానుకూలంగా స్పందించి జూలై 31 దాటిన తర్వాత కూడా రిటర్న్ ల ఫైలింగ్ కు అనుమతిస్తుందని వార్తలు వస్తున్నాయి.

దీనిపై ఆదాయపు పన్ను శాఖ ఇవాళ స్పష్టత ఇచ్చింది. 2023-24 ఆర్ధిక సంవత్సరానికి రిటర్న్ ల ఫైలింగ్ కోసం తాము ఇప్పటికే ఇచ్చిన గడువు తేదీ జూలై 31కి ఎట్టి పరిస్ధితుల్లోనూ పొడిగింపు ఇచ్చేది లేదని తేల్చేసింది. కాబట్టి ఆదాయపు పన్ను చెల్లింపు దారులు సకాలంలో రిటర్న్ లు ఫైల్ చేయాలని సూచించింది. రిటర్న్ ల ఫైలింగ్ కోసం చివరి నిమిషం వరకూ వేచి చూడవద్దని కోరుతోంది. జూలై 26 నాటికి దేశంలో 5 కోట్ల రిటర్న్ లు పైల్ అయినట్లు కూడా వెల్లడించింది.

Income Tax Return Filing Deadline To Be Extended IT Department clarified

దేశవ్యాప్తంగా చాలా మంది పన్ను చెల్లింపుదారులు, చార్టర్డ్ అకౌంటెంట్లు ఐటీ ఫైలింగ్ పోర్టల్‌తో సమస్యలను ప్రస్తావిస్తున్న నేపథ్యంలో ఐటీశాఖ ఈ ప్రకటన చేసింది. వీరు ప్రస్తావిస్తున్న ఐటీ రిటర్న్ ఫైలింగ్ సమస్యలలో ఓటీపీలు జనరేట్ చేయడంలో లోపాలు, రాయితీలను క్లెయిమ్ చేయడంలో ఇబ్బందులు ఉన్నట్లు చెప్తున్నారు. అయితే ఐటీ శాఖ మాత్రం జూలై 31 తర్వాత రిటర్న్ ల ఫైలింగ్ కు గడువు పొడిగింపు ఉండబోదని, ఆ తర్వాత చెల్లించావారికి పెనాల్టీలు తప్పవని స్పష్టం చేస్తోంది. దీంతో ఇప్పటివరకూ రిటర్న్ లు ఫైల్ చేయని వారు ఎవరైనా ఉంటే రేపటి లోగా చేయాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+