ఎవరూ ఊహించని సాహసం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎవరూ ఊహించని సాహసం చేశారు. ఎప్పుడూ లేని విధంగా ఏకంగా అత్యంత శక్తిమంతమైన రాఫెల్ జెట్ ఫైటర్ లో ప్రయాణించారు. హర్యానాలోని అంబాలా ఎయిర్ ఫోర్స్ బేస్ స్టేషన్‌లో రాఫేల్ యుద్ధ విమానాన్ని అధిరోహించారు. ఈ ఉదయం దేశ రాజధానిలోని తన అధికారిక నివాసం రాష్ట్రపతి భవన్ నుంచి నేరుగా హర్యానాలోని అంబాలా ఎయిర్ ఫోర్స్ బేస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అనంతరం రాఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణించారు.
ఆ సమయంలో ఆమె వెంట ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ఉన్నారు. రాష్ట్రపతి ముర్ము రాఫేల్ యుద్ధ విమానంలోకి ఎక్కుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. బేస్ స్టేషన్ లో ఆమెకు వైమానిక దళాధికారులు సాదరంగా ఆహ్వానించారు. లాంఛనప్రాయంగా గౌరవ వందనం చేశారు. అనంతరం జీ- సూట్ ధరించి రాఫేల్ జెట్ వద్దకు చేరుకున్నారు ముర్ము. ఆ సమయంలో హెల్మెట్ పట్టుకుని, సన్ గ్లాసెస్‌తో కనిపించారు ద్రౌపది ముర్ము. పైలట్‌తో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు.

ప్రజలకు అభివాదం చేస్తూ రఫెల్ యుద్ధ విమానంలో అడుగుపెట్టారు. సరిగ్గా ఈ ఉదయం 11.28 నిమిషాలకు రాఫెల్ జెట్ ఫైటర్ రివ్వుమంటూ గగనంలోకి దూసుకుపోయింది. రఫేల్ జెట్లను ఆపరేషన్ సింధూర్‌లో ఉపయోగించిన విషయం తెలిసిందే. 2023 ఏప్రిల్ లో ద్రౌపది ముర్ము అస్సాంలోని తేజ్‌పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానంలో ప్రయాణించారు. ఆ తర్వాత ఇప్పుడు రాఫెల్ జెట్ ఫైటర్ ను అధిరోహించారు.
గతంలో రాష్ట్రపతులు ఏపీజే అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్ కూడా సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానాలలో ప్రయాణించారు. 2006 జూన్ 8వ తేదీన అబ్దుల్ కలాం, 2009 నవంబర్ 25వ తేదీన ప్రతిభా పాటిల్.. పూణే సమీపంలోని లోహెగావ్‌లో గల ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి సుఖోయ్ యుద్ధ విమానాన్ని ఎక్కారు.
ఫ్రాన్స్‌కు చెందిన డస్సాల్ట్ ఏవియేషన్ సంస్థ తయారు చేసిన రఫేల్ యుద్ధ విమానాలను 2020 సెప్టెంబర్ లో అంబాలాలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు చేరిన విషయం తెలిసిందే. భారత వైమానిక దళంలో లాంఛనప్రాయంగా వీటిని ఇంట్రడ్యూస్ చేశారు.2020 జులైలో ఫ్రాన్స్ నుండి వచ్చిన మొదటి అయిదు రఫేల్ యుద్ధ విమానాలను 17వ స్క్వాడ్రన్ గోల్డెన్ యారోస్ లో చేర్చారు. పాకిస్తాన్ భూభాగంపై గల ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడానికి మే 7న ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్‌లో ఈ రఫేల్ జెట్‌లను ఉపయోగించారు.
VIDEO | VIDEO | Air Force Base, Ambala: President Droupadi Murmu boards Rafale jet. She will take a sortie in the fighter jet shortly.@rashtrapatibhvn @IAF_MCC
— Press Trust of India (@PTI_News) October 29, 2025
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/dzz1BJlXN1
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications