Arshdeep Singh: ఇంత వరస్ట్ ఏంట్రా సామి..!!
గువాహటి: భారత క్రికెట్ జట్టు జైత్రయాత్ర బ్రేకుల్లేకుండా సాగుతోంది. రోజుల తేడాలో రెండు టీ20 సిరీస్‌లను చేజిక్కించుకుంది. టీమిండియా దెబ్బకు మొన్నటికి మొన్న ఆస్ట్రేలియన్లకు కళ్లు బైర్లు కమ్మగా- ఇప్పుడు దక్షిణాఫ్రికా మట్టికరిచింది. మూడు టీ20 మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను కూడా సొంతం చేసుకుంది రోహిత్ సేన. ఇంకో మ్యాచ్ మిగిలివుండగానే.. 2-0 తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఈ సిరీస్‌లో చివరిదైన మూడో టీ20 రేపు మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో షెడ్యూల్ అయింది.
మూడు వన్డేల సిరీస్ కోసం..
దీని తరువాత మూడు వన్డేల సిరీస్ ఆరంభమౌతుంది. 6, 9, 11 తేదీల్లో ఇవి జరుగనున్నాయి. ఈ సిరీస్‌లో ఆడే భారత జట్టుకు డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ నాయకత్వాన్ని వహించనున్నాడు. ఇది ముగిసిన తరువాత టీ20 ప్రపంచ కప్ 2022 టోర్నమెంట్‌లో ఆడటానికి టీమిండియా.. ఆస్ట్రేలియాకు బయలుదేరి వెళ్తుంది. ఈ ప్రిస్టేజియస్ టోర్నీ ఆరంభానికి ముందు- టీ20ల్లో భారత అదరగొడుతోండటం శుభపరిణామం.
భారీ స్కోర్‌తో..
అస్సాంలోని గువాహటి స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో భారత్.. భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లల్లో మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి 237 పరుగులు చేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్-57, రోహిత్ శర్మ-43 పరుగులతో శుభారంభాన్ని ఇవ్వగా.. మిగిలిన బ్యాటర్లు దాన్ని అందిపుచ్చుకున్నారు. విరాట్ కోహ్లీ-49, సూర్యకుమార్ యాదవ్-61 పరుగులు చేశారు. చివర్లో వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ మెరుపులు మెరిపించాడు. ఏడు బంతుల్లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 17 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ప్రొటీస్.. నెవర్ గివ్ అప్..
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నెవర్ గివ్ అప్ తరహాలో ఆడింది. చివరి వరకూ పోరాడింది. జట్టు స్కోరు ఒక్క పరుగు వద్ద ఉన్నప్పుడే ఇద్దరు కీలక బ్యాటర్లు పెవిలియన్ చేరారు. కేప్టెన్ టెంబా బావుమా, టాప్ ఆర్డర్ బ్యాటర్ రిలీ రొస్సో తమ ఖాతాను కూడా తెరవలేకపోయారు. 19 బంతుల్లో ఒక సిక్సర్, నాలుగు ఫోర్లతో ఎయిడెన్ మార్క్‌రమ్ 33 పరుగులు చేసి ఫర్వాలేదనిపించుకున్నాడు. మరో ఓపెనర్ క్వింటన్ డికాక్- 69, మిడిలార్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ సెంచరీతో కదం తొక్కారు. 47 బంతుల్లోనే 106 పరుగులు చేశాడు.
అర్ష్‌దీప్ బలి..
డేవిడ్ మిల్లర్ దూకుడుకు బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ బలి అయ్యాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన 19వ ఓవర్‌లో మిల్లర్ విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఆ ఒక్క ఓవర్‌లోనే 26 పరుగులు రాబట్టుకున్నాడు. గెలవాలంటే 12 బంతుల్లో 63 పరుగులు చేయాల్సిన దశలో బంతిని అందుకున్న సింగ్.. తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ధారాళంగా పరుగులను సమర్పించుకున్నాడు. 19వ ఓవర్ తొలిబంతిని నోబాల్‌గా విసిరాడు. దీనితో ఎక్స్‌ట్రా రన్.. ఎక్స్‌ట్రా బాల్ లభించింది దక్షిణాఫ్రికాకు.
బంతి బంతికీ పరుగులు..
రెండో బంతిని ఫెన్సింగ్ దాటించాడు మిల్లర్. నేరుగా స్టంప్స్ మీదికి సంధించిన హై-ఫుల్‌టాస్‌ను మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్స్ కొట్టాడు. మూడో బంతి వైడ్‌గా వెళ్లింది. దీనితో మళ్లీ ఓ ఎక్స్‌ట్రా రన్.. ఎక్స్‌ట్రా బాల్ లభించింది. ఆ ఎక్స్‌ట్రా బంతిని ఫోర్‌గా బాదాడు మిల్లర్. డీప్ మిడ్ వికెట్ మీదుగా బుల్లెట్‌లా దూసుకెళ్లిందా షాట్. లో ఫుల్‌టాస్‌గా వేసిన నాలుగో బంతిని మళ్లీ బౌండరీని లాంగ్ ఆన్-డీప్ మిడ్ వికెట్ దిశగా ఫ్లిక్ చేశాడు మిల్లర్. బౌండరీ లైన్ దాటిందా బాల్. అయిదో బంతికి రెండు పరుగులు రాగా.. చివరి బంతిని మిడ్ వికెట్ మీదుగా మళ్లీ సిక్స్ బాదాడు.
నాలుగు ఓవర్లల్లో..
ఈ ఓవర్ ముగిసేసరికి అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్ ఫిగర్స్ మొత్తం మారిపోయాయి. నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 62 పరుగులు ఇచ్చుకున్నాడు. రెండు వికెట్లు పడగొట్టిన ఆనందం కూడా అతనికి మిగలకుండా పోయింది. ఈ ఒక్క ఓవర్.. అర్ష్‌దీప్ సింగ్‌ను మళ్లీ నెటిజన్ల నెటిజన్ల ఆకలికి ఆహారంలా మారేలా చేసింది. ట్రోల్స్‌కు గురిచేసింది. అర్ష్‌దీప్ సింగ్‌పై భారీగా ట్రోల్స్ పడుతున్నాయి. మీమ్స్‌తో ఆడుకుంటోన్నారు అభిమానులు.
I m speechless . Our mgmt thinks Arshdeep-Harshal as new age Wasim-Waqar 🤣...better bowling attack is playing in Irani
— amitava (@amitava0112) October 2, 2022
& if SA change captain ,they might b world champs
Dude You're On 19th Over , People Came Out Of It . Watch Yesterday's 19th Over, 2nd Time Arshdeep Gave Worst In Penultimate. Even Bumrah Was Trashed. Keeping Analyst In Bio Won't Make You Analyst. You Have To Consider All Facts
— జాతీయవాది 🇮🇳 (@TeluguJatiyvadi) October 3, 2022












Click it and Unblock the Notifications