మండ్యలో సుమలత భారీ విజయం, సీఎం కుమారస్వామికి ఎదురు దెబ్బ, పరువు ప్రతిష్ట అంటే !
బెంగళూరు: మండ్య లోక్ సభ నియోజక వర్గంలో చివరిదాకా నువ్వానేనా అంటూ పోటీ ఎదుర్కొన్న బహుబాష నటి సుమలత చివరికి భారీ విజయం సాధించారు. సుమలత ఎంపీగా విజయం సాధించడంతో సీఎం కుమారస్వామితో పాటు సంకీర్ణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ పడింది.
స్వంతత్ర పార్టీ అభ్యర్థిగా మండ్య లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన సుమలతకు స్థానికులు భ్రహరథం పట్టారు. కాంగ్రెస్ మద్దతుతో జేడీఎస్ అభ్యర్థిగా సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి పోటీ చేశారు. మొదటి రౌండ్ నుంచి సుమలత, నిఖిల్ కుమారస్వామి పోటీ పడ్డారు.

స్వంతత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సుమలతకు బీజేపీ మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ రెబల్స్ తెర వెనుక సుమలతకు మద్దతు ఇచ్చారు. మండ్య జిల్లాలో 8 మంది జేడీఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా సీఎం కుమారస్వామి పరువును కాపాడలేకపోయారు.
జేడీఎస్ కు కంచుకోట అయిన మండ్యలో నిఖిల్ కుమారస్వామి విజయం సాధిస్తారని అందరూ అనుకున్నారు. ముఖ్యంగా సీఎం కుమారస్వామి శక్తి వంచన లేకుండా మండ్యలో ఎన్నికల ప్రచారం చేశారు. అయితే సీఎం కుమారస్వామి ఎత్తులు మండ్యలో పని చెయ్యలేదు.
మండ్యలో దాదాపు 76 వేల మెజారిటీతో సుమలత విజయం సాధించడంతో సీఎం కుమారస్వామి పరోక్షంగా ఓడిపోయినట్లు అయ్యిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కర్ణాటక చరిత్రలో 52 ఏళ్లలో మొదటి సారి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఒక మహిళ లోక్ సభలో అడుగుపెడుతున్నారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications