వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్, చైనాల మధ్య ప్రచ్ఛన్నయుద్దం: అమెరికా మాజీ దౌత్యాధికారి ఐర్స్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్, చైనాల మధ్య సంబంధాల్లో ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం కనిపిస్తోందని అమెరికా మాజీ దౌత్యాధికారిణి అలిసా ఐర్స్‌ అభిప్రాయపడ్డారు. చైనాను నిలువరించే క్రమంలో అమెరికా నేతృత్వంలోని కూటమిలో భారత్‌ చేరే అవకాశాలు లేవన్నారు.

డోక్లామ్ సరిహద్దుల్లో చైనా తన సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకొంది. ఇండియా సరిహద్దుల వెంట చైనా తన సైనిక బలగాలను వెంటనే చేరుకొనేలా రోడ్లను ఏర్పాటు చేస్తోంది.

శాటిలైట్ చిత్రాల్లో చైనా రోడ్డు మార్గాలను ఏర్పాటు చేస్తున్న చిత్రాలు ఇటీవల కాలంలో వెలుగు చూశాయి. ఈ పరిణామాలను పరిశీలిస్తున్న పశ్చిమాసియా దేశాల విశ్లేషకులు యుద్ద పరిణామాలు చోటు చేసుకొనే అవకాశాలున్నాయని ఆందోళనలు వ్యక్తం చేశారు. అయితే తాజాగా అమెరికా మాజీ దౌత్యాధికారిణి కూడ ఇండియా, చైనా సంబంధాలపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు.

ఇండియా, చైనా మద్య ప్రచ్ఛన్న యుద్దం

ఇండియా, చైనా మద్య ప్రచ్ఛన్న యుద్దం

భారత్, చైనాల మధ్య సంబంధాల్లో ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం కనిపిస్తోందని అమెరికా మాజీ దౌత్యాధికారిణి అలిసా ఐర్స్‌ అభిప్రాయపడ్డారు దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల విభాగంలో పనిచేసిన అలిసా ప్రస్తుతం విదేశీ వ్యవహారాల కౌన్సిల్‌లో సభ్యురాలిగా ఉన్నారు. ఆమె రాసిన పుస్తకం ‘అవర్‌ టైం హాజ్‌ కమ్‌: హౌ ఇండియా ఈజ్‌ మేకింగ్‌ ఇట్స్‌ ప్లేస్‌ ఇన్‌ ది వరల్డ్‌' అనే పుస్తకం విడుదల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.న్యూయార్క్‌లో ఈ సమావేశాన్ని నిర్వహించారు.

డోక్లామ్‌లో మళ్ళీ టెన్షన్: పోటా పోటీగా ఆర్మీ మోహరింపు, డ్రాగన్‌కు ఇండియా షాక్ డోక్లామ్‌లో మళ్ళీ టెన్షన్: పోటా పోటీగా ఆర్మీ మోహరింపు, డ్రాగన్‌కు ఇండియా షాక్

హిందూ మహసముద్రంపై చైనా ఆధిపత్యం ఇండియాకు ఇష్టం లేదు

హిందూ మహసముద్రంపై చైనా ఆధిపత్యం ఇండియాకు ఇష్టం లేదు

చైనాతో పటిష్టమైన వాణిజ్య సంబంధాలు ఇండియా కొనసాగుతున్నప్పటికీ ఆ దేశం సంతృప్తి చెందటం లేదని అమెరికా మాజీ దౌత్యాధికారిణి అలిసా ఐర్స్‌ అభిప్రాయపడ్డారు . హిందూ మహా సముద్ర ప్రాంతంలో చైనా ప్రాబల్యం పెంచుకోవటంపై భారత్ తీవ్ర అసంతృప్తిగా ఉందని అలిసా ఐర్స్ చెప్పారు. టిబెట్‌లో సైనిక స్థావరం ఏర్పాటును భారత్‌ తీవ్రంగా పరిగణిస్తోందన్నారు.

ఇండియాకు డ్రాగన్ షాక్: డోక్లామ్‌లో రోడ్డు, ఆర్మీ క్యాంప్ ఇండియాకు డ్రాగన్ షాక్: డోక్లామ్‌లో రోడ్డు, ఆర్మీ క్యాంప్

పాక్, శ్రీలంకతో చైనా సంబంధాలు భారత్‌కు దెబ్బే

పాక్, శ్రీలంకతో చైనా సంబంధాలు భారత్‌కు దెబ్బే


పాక్, శ్రీలంకలతో చైనా సన్నిహితంగా మెలుగుతూ పెట్టుబడులు పెట్టడం భారత్‌కు ఇబ్బంది కలిగిస్తోందని అమెరికా మాజీ దౌత్యాధికారిణి అలిసా ఐర్స్‌ చెప్పారు.
స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు ప్రాధాన్యమిచ్చే వాతావరణం ప్రపంచమంతటా ఉండాలని భారత్‌ ఆకాంక్షిస్తోందని ఆమె చెప్పారు.

భారత్ ఉదాసీనంగా ఉండదు

భారత్ ఉదాసీనంగా ఉండదు

2008 ముంబై దాడుల వంటివి పునరావృతమైతే భారత్‌ ఉదాసీన వైఖరితో ఉంటుందని భావించలేమని అమెరికా మాజీ దౌత్యాధికారి అలిసా ఐర్స్ చెప్పారు . గతేడాది పాక్‌ భూభాగంపై భారత్‌ సర్జికల్‌ దాడులను ఇందుకు ఉదాహరణగా చెప్పారు. 2018లో ప్రపంచంలో ఐదో ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు భారత్‌ ముందడుగు వేస్తోందని చెప్పారు.

English summary
India and China have a "Cold-War-like" relationship in the making, but New Delhi is unlikely to join something framed as a US-led front to contain Beijing, a former American diplomat has said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X