India corona update: ఇండియాలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు.. గత 24 గంటల్లో 6088 కొత్త కేసులు

ఇండియాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కోవిడ్ -19 మహమ్మారి భారతదేశంలో చాప క్రింద నీరులా విస్తరిస్తుంది. ఇక దీంతో మొత్తం కేసుల సంఖ్య ఇప్పుడు 1,18,447 గా ఉన్నాయి. భారతదేశంలో కరోనా వ్యాప్తి చెందడంతో మరణించిన వారి సంఖ్య 3,583. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, మరియు ఢిల్లీలలో అత్యధిక కేసులు నమోదయ్యాయి.

Recommended Video

    Coronavirus In India: 6088 New Cases in Last 24 Hours, Record High

    లాక్ డౌన్ సడలింపులతో ఆందోళనకరంగా కరోనా కేసులు

    లాక్ డౌన్ సడలింపులతో ఆందోళనకరంగా కరోనా కేసులు

    గతంలో ఎప్పుడూ లేనంతగా కరోనా కేసులు పెరిగిపోవడం భారతీయులకు ఆందోళన కలిగిస్తోంది. గత వారం రోజులుగా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేసులు పెరుగుతున్న సమయంలో సడలింపులు ఇవ్వడం కేసులు పెరిగేందుకు మరొక కారణం అవుతున్నది అనడంలో ఎలాంటి సందేహం లేదు . అన్ని రాష్ట్రాలలోనూ ఆర్ధిక పరిస్థితి దారుణమైన సంక్షోభానికి గురవుతున్న నేపధ్యంలో లాక్ డౌన్ సడలింపులు ఇస్తున్నారు . ఇక ఈ క్రమంలో ఎవరికి వారు వ్యక్తిగత రక్షణా చర్యలు చేపట్టాలని చెప్తున్నారు. కానీ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. లాక్ డౌన్ సడలింపుల నేపధ్యంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

    కరోనా కోరల్లో విలవిలలాడుతున్న దేశం..ఢిల్లీలో 660 కొత్త కేసులు

    కరోనా కోరల్లో విలవిలలాడుతున్న దేశం..ఢిల్లీలో 660 కొత్త కేసులు

    ఇక మహారాష్ట్రలో అత్యధిక కరోనా కేసులు నమోడుయ్యాయి. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 41 వేల 642కి చేరింది. ముంబైలో అత్యధిక కేసులు నమోదు కావటంతో దేశ ఆర్ధిక రాజధాని కరోనా కోరల్లో చిక్కుకుంది . ఇక గత 24 గంటల్లో దేశ రాజధాని ఢిల్లీలో 660 కేసులు నమోదయ్యాయి, మొత్తం మొత్తం రాజధానిలో కేసుల సంఖ్య 12,319 కు చేరుకుంది; ఇక మరణాలు 208గా ఉంది . ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం ఉదయం 8 గంటల వరకు 340 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇది రాష్ట్రంలో మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య 5,515 కు చేరుకుంది. ఇక బాధితుల్లో 3,204 మంది కోలుకున్నారు మరియు 138 మంది మరణించారు.

    గత 24 గంటల్లో ఇండియాలో 6088 కొత్త కరోనా కేసులు ..ఒక రోజు కేసుల్లో ఇదే అత్యధికం

    గత 24 గంటల్లో ఇండియాలో 6088 కొత్త కరోనా కేసులు ..ఒక రోజు కేసుల్లో ఇదే అత్యధికం

    తాజా సమాచారం ప్రకారం గత 24 గంటల్లో ఇండియాలో 6088 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో మొత్తం కేసుల సంఖ్య 1,18,447 కేసులు నమోదుకాగా, 3,583 మంది మరణించారు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు 24 గంటల్లో నమోదైన అత్యధిక కేసులు ఇవే . ఇక కొత్త కేసులు విపరీతంగా పెరగటం అత్యంత ఆందోళన కలిగించే అంశం .

    ప్రపంచ వ్యాప్తంగా 51.32 లక్షల కేసులు

    ప్రపంచ వ్యాప్తంగా 51.32 లక్షల కేసులు

    ఇక ఇదిలా ఉంటె ప్రపంచంలో కూడా కరోనా కేసులు భారీగా పెరిగుతున్నాయి. గత 24 గంటల్లో లక్ష కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. మొత్తం మీద ఇప్పటి వరకు 51.32 లక్షల కేసులు నమోదు కాగా, 3.34 లక్షల మందికి పైగా మరణించారు. యునైటెడ్ స్టేట్స్, రష్యా, బ్రెజిల్, యునైటెడ్ కింగ్‌డమ్ మరియు స్పెయిన్ దేశాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+