భారత జీడీపీ 7.2 శాతం: సవాళ్ల మధ్య సానుకూలమంటూ ప్రధాని మోడీ, చైనా కంటే మెరుగ్గా!

న్యూఢిల్లీ: భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కీలకమైన దేశ స్థూల జాతీయోత్పత్తి(GDP) గణాంకాలు వెలువడ్డాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 7.2 శాతం వృద్ధి చెందింది. ఇదే ఏడాది చివరి త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 6.1 శాతంగా నమోదైంది. వ్యవసాయం, తయారీ, మైనింగ్, నిర్మాణ రంగాలు రాణించడంతో వృద్ధికి దోహదపడింది. ఈ మేరకు కేంద్ర గణాంక కార్యాలయం(NSO-) జీడీపీ గణాంకాలను బుధవారం విడుదల చేసింది.

2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధిరేటు 9.1 శాతం కాగా, 2022-23 7.2 శాతంగా నమోదైంది. త్రైమాసికాల వారీగా చూస్తే ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 13.1 శాతం, జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో 6.2 శాతం, అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో 4.5 శాతం, జనవరి-మార్చి త్రైమాసికంలో ఇది 6.1 శాతం నమోదైంది.

 india gdp 7.2 % in fy-2023: PM modi says, GDP Figures Show Resilience of Economy Despite Global Challenges

జీడీపీ గణాంకాలు గ్లోబల్ సవాళ్లు ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకతను చూపుతున్నాయి: ప్రధాని మోడీ

2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)లో 7.2 శాతం వృద్ధి.. ప్రపంచ ఒడిదుడుకులు ఉన్నప్పటికీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకంగా ఉందని తెలియజేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం అన్నారు. 2022-23 జీడీపీ వృద్ధి గణాంకాల పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే దేశ ఆర్థిక వ్యవస్థకు ఆశాజనకమైన పథంలో ఉందన్నారు.

'2022-23 జీడీపీ వృద్ధి గణాంకాలు ప్రపంచ సవాళ్ల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకతను నొక్కి చెబుతున్నాయి. మొత్తం ఆశావాదం, బలమైన స్థూల-ఆర్థిక సూచికలతో పాటు ఈ దృఢమైన పనితీరు మన ఆర్థిక వ్యవస్థ ఆశాజనక పథం, మన ప్రజల దృఢత్వానికి ఉదాహరణ' అని ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఈ వృద్ధి భారత ఆర్థిక వ్యవస్థను USD 3.3 ట్రిలియన్లకు కొనసాగించడంతోపాటు రాబోయే కొన్ని సంవత్సరాలలో USD ఐదు ట్రిలియన్ల లక్ష్యాన్ని సాధించడానికి వేదికను నిర్దేశించింది.

కాగా, NSO నుంచి వచ్చిన డేటా ఆధారంగా.. 2022-23 ఆర్థిక సంవత్సరానికి నిజమైన GDP ధరలు రూ. 160.06 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా వేయబడింది. ఈ సంఖ్య గత ఆర్థిక సంవత్సరం 2021-22లో రూ. 149.26 లక్షల కోట్ల మొదటి సవరించిన GDP అంచనాలను అధిగమించింది. మరోవైపు, 2023 మొదటి మూడు నెలల్లో చైనా 4.5 శాతం ఆర్థిక వృద్ధిని మాత్రమే నమోదు చేయడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+