చైనాకు భారత్ షాక్: ఒకేసారి 6సబ్ మెరైన్ల నిర్మాణం

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: చైనా కుయుక్తులకు భారత్ ఎప్పటికప్పుడు ధీటుగా సమాధానం చేప్తూనే వస్తోంది. అంతేగాక, చైనాను అంతర్జాతీయంగా ఇప్పటికే పూర్తిగా ఇరుకున పెట్టిన భారత్‌.. తాజాగా మరో అడుగు ముదుకేసింది, డోక్లాం వివాదం తర్వాత సరిహద్దుల్లో భారత్‌ భద్రతను కట్టు దిట్టం చేసింది.

ఇప్పటివరకూ న్యూక్లియర్‌ సబ్‌ మెరైన్లపై పెద్దగా దృష్టిపెట్టని భారత్‌.. ఏక కాలంలో ఆరు న్యూక్లియర్‌ సబ్‌ మెరైన్ల నిర్మాణాన్ని ప్రారంభించింది. ఇదే విషయాన్ని నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ సునీల్‌ లంబా వెల్లడించారు.

India kickstarts process to build 6 nuclear-powered attack submarines

ఇండో-పసిఫిక్‌ రీజియన్‌లో భారత్‌, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాల చతుర్భుజ కూటమికి స్థిరమైన ఆకృతిని తీసుకురావడంలో నేవీ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన చెప్పారు. ఇండో పసిఫిక్‌ రీజియన్‌లో చైనాకు చెక్‌ పెట్టే శక్తి ఒక్క భారత్‌కు మాత్రమే ఉందని ఆయన చెప్పారు.

కాగా, భారత నేవీ సామర్థ్యాన్ని ఇవి మరింత పటిష్టం చేస్తాయని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ సబ్ మెరైన్ల నిర్మాణాలతో ఇండో పసిఫిక్‌ రీజియన్‌లో చైనా ఆధిపత్యాన్ని భారత్‌ సవాల్‌ చేయగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India has kick-started the process to build six nuclear-powered attack submarines which will significantly boost the Navy's overall strike capabilities in the face of China's growing military manoeuvring in the Indo-Pacific region.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి