BCCI కు ఆ లక్కీ ఛాంప్ ఎలా దొరికింది? ప్రార్థన చేసి.. ప్రపంచ కప్ గెలిచి..
కొన్నిసార్లు విజయం కేవలం కష్టపడితేనే రాదు, కోట్లాది మంది ఆశీస్సులు తోడైనప్పుడు అద్భుతాలు జరుగుతాయి. భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ సరిగ్గా ఇలాంటి ఒక అద్భుతానికే సాక్ష్యంగా నిలిచింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు స్టేడియం అంతా జాతీయ గీతాలాపనతో మారుమోగుతుండగా, టీమిండియా స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ ముందు నిలబడిన ఒక చిన్నారి మస్కట్ చేసిన పని ఇప్పుడు ప్రపంచవ్యాప్త క్రికెట్ అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఆ చిన్నారి కళ్ళు మూసుకుని, చేతులు జోడించి అత్యంత భక్తితో చేసిన ప్రార్థన సోషల్ మీడియాలో 'పిక్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచింది. ఆ నిష్కల్మషమైన ప్రార్థనే శాంసన్ ఇన్నింగ్స్‌కు దేవుడి బలం కవచంలా మారిందని అభిమానులు నమ్ముతున్నారు.
అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా చర్చకు వచ్చిన మరో ఆసక్తికర అంశం 'మస్కట్ కిడ్స్'. అసలు ఆటగాళ్ల చేతులు పట్టుకుని మైదానంలోకి వచ్చే ఈ చిన్నారుల సంప్రదాయం ఎక్కడ మొదలైందనేది చాలామందికి తెలియదు. ఈ సంప్రదాయం తొలుత 1990లలో ఫుట్‌బాల్ క్రీడలో ప్రారంభమైంది. ముఖ్యంగా 2000 యూరో కప్ సమయంలో ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత క్రికెట్, టెన్నిస్ వంటి ఇతర క్రీడల్లోనూ ఇది ఒక భాగంగా మారింది.

ఆటలో పారదర్శకతను (Fair Play) చాటడానికి పిల్లలు చిహ్నమని, వారు మైదానంలో ఉంటే ఆటగాళ్లలో క్రీడాస్ఫూర్తి పెరుగుతుందని నిర్వాహకులు భావిస్తారు. అలాగే కుటుంబాలకు దూరంగా ఉండే ప్లేయర్లు.. ఇలా చిన్నపిల్లలతో కొంచం చేపు సమయం గడపడం ద్వారా వారు ఒత్తిడిని తగ్గించుకుంటారని కూడా చెప్తుంటారు. పిల్లలు అమాయకులు. కల్మషం లేకుండా ప్రవర్తిస్తారు. ఆ ప్రవర్తనలే చాలా మంది మనసును హత్తుకుంటాయి. పాజిటివిటి బిల్డ్ అవుతుంది.
చిన్నారుల సెలెక్షన్ ఎలా జరుగుతుంది?
మస్కట్ కిడ్స్‌ను ఎంపిక చేయడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి..
- స్పాన్సర్ల ద్వారా: టోర్నమెంట్ అధికారిక స్పాన్సర్లు (ఉదాహరణకు కోకాకోలా, మాస్టర్ కార్డ్ వంటివి) వివిధ పోటీలు లేదా లక్కీ డ్రా ద్వారా చిన్నారులను ఎంపిక చేస్తారు.
- లోకల్ క్లబ్‌లు: మ్యాచ్ జరుగుతున్న నగరంలోని స్థానిక క్రికెట్ అకాడమీలు లేదా పాఠశాలల నుంచి ప్రతిభావంతులైన పిల్లలను ఎంపిక చేస్తారు.
- చారిటీ సంస్థలు: కొన్నిసార్లు అనాథాశ్రమాలు లేదా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఈ అరుదైన అవకాశాన్ని కల్పిస్తారు.
- వయోపరిమితి: సాధారణంగా 6 నుండి 12 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలను ఎంపిక చేస్తారు.
అలా ఎంపికైన ఒక చిన్నారి చేసిన ప్రార్థనే ఇప్పుడు శాంసన్ ఇన్నింగ్స్ వెనుక 'అదృశ్య శక్తి'గా నిలిచిందని అభిమానులు మురిసిపోతున్నారు.
మస్కట్ కిడ్స్‌కు లభించే ప్రోత్సాహకాలు
మస్కట్ కిడ్స్‌గా ఎంపికైన చిన్నారులకు సాధారణంగా నగదు రూపంలో పారితోషికం ఉండదు. కానీ, వారికి లభించే అనుభవం మరియు ఇతర ప్రోత్సాహకాలు ఏ ధనంతోనూ పోల్చలేనివి. తమ ఆరాధ్య క్రికెటర్ల చేతులు పట్టుకుని మైదానంలోకి నడవడం, వారితో కలిసి జాతీయ గీతాలాపనలో పాల్గొనడం చిన్నారులకు జీవితకాల జ్ఞాపకం. స్పాన్సర్లు ఆ చిన్నారులకు ప్రత్యేకమైన జెర్సీలు, షూస్, క్యాప్స్, ఇతర స్పోర్ట్స్ యాక్సెసరీలను ఉచితంగా అందజేస్తారు. వీటిని వారు జ్ఞాపికలుగా ఉంచుకోవచ్చు. మస్కట్ కిడ్స్‌తో పాటు వారి తల్లిదండ్రులకు లేదా సంరక్షకులకు (సాధారణంగా ఒకరికి) మ్యాచ్‌ను వీక్షించడానికి వీఐపీ (VIP) లేదా గ్యాలరీ టిక్కెట్లు ఉచితంగా లభిస్తాయి. ఐసీసీ (ICC) లేదా సంబంధిత బోర్డుల నుంచి వారికి అధికారిక సర్టిఫికేట్లు అందజేస్తారు, ఇది వారి విద్యా లేదా క్రీడా ప్రొఫైల్‌కు అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వీక్షిస్తున్న టీవీ స్క్రీన్లపై కనిపించే అవకాశం దక్కుతుంది.
శిక్షణ..
మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు వీరికి మైదానంలో ఎలా నడవాలి, జాతీయ గీతం సమయంలో ఎలా నిలబడాలి అనే అంశాలపై చిన్నపాటి 'రిహార్సల్' నిర్వహిస్తారు.
ఆసక్తికరమైన విషయాలు..
ప్లేయర్లతో పాటు వచ్చే పిల్లల భద్రత బాధ్యత పూర్తిగా నిర్వాహకులదే. కొన్నిసార్లు ప్రత్యేక సందర్భాల్లో (ఉదాహరణకు క్యాన్సర్ అవగాహన) కేవలం క్యాన్సర్ జయించిన చిన్నారులను మాత్రమే మస్కట్ కిడ్స్‌గా పిలుస్తారు.
-
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ కు ఇంగ్లండ్ స్టార్ సడన్ గుడ్ బై-నిషేధం తప్పదా ? -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !!












Click it and Unblock the Notifications