iNCOVACC: భారత్ లో తొలి నాసికా వ్యాక్సిన్ విడుదల- భారత్ బయోటెక్ తయారీ-ధరలివే..
భారత్ లో తొలి నాసికా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. భారత్ బయోటెక్ తయారు చేసిన ఈ వ్యాక్సిన్ ను ముక్కులో నేరుగా వేసుకునే అవకాశం ఉంది.
synopsis : భారత్ లో తొలి నాసికా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. భారత్ బయోటెక్ తయారు చేసిన ఈ వ్యాక్సిన్ ను ముక్కులో నేరుగా వేసుకునే అవకాశం ఉంది.
కోవిడ్ 19 మహమ్మారి నుంచి జనాన్ని రక్షించేందుకు వ్యాక్సిన్ల ప్రయోగాలు జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగా ఇప్పుడు కోవిడ్ నాసికా వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. కేంద్రం ఇవాళ దీన్ని ఆవిష్కరించింది.

భారత్ బయోటెక్ తయారు చేసిన తొలి కోవిడ్ 19 నాసికా వ్యాక్సిన్ ను కేంద్ర ఆరోగ్యమంత్రి మన్ సుఖ్ మాండవీయ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ ఢిల్లీలో ఆవిష్కరించారు. ప్రపంచంలోనే మొట్టమొదటి కోవిడ్-19 ఇంట్రానాసల్ వ్యాక్సిన్ ఇన్ కోవాక్ ను ప్రారంభించారు. భారతదేశానికి చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ ఒక్కో డోస్‌కు ప్రభుత్వానికి 325కి భారత్ బయోటెక్ విక్రయించబోతోంది. అలాగే ప్రైవేట్ ఆసుపత్రులలో దీని ధర రూ.800గా నిర్ణయించింది.
గతేడాది డిసెంబర్లో ప్రాథమిక 2-డోస్ షెడ్యూల్‌కు మరియు హెటెరోలాగస్ బూస్టర్ డోస్ తయారీకి భారత్ బయోటెక్ కు కేంద్రం ఆమోదం తెలిపింది. అంతకు ముందు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో అత్యవసర పరిస్థితుల్లో ఈ నాసికా వ్యాక్సిన్ వాడేందుకు ఆమోదించింది. ఈ నాసికా వ్యాక్సిన్ 28 రోజుల తేడాతో రెండు డోసుల చొప్పున వేసుకోవాల్సి ఉంటుంది. కోవిన్ ప్లాట్‌ఫారమ్‌లో వ్యాక్సిన్‌ను ప్రవేశపెట్టిన వారం తర్వాత, ముందుజాగ్రత్త లేదా బూస్టర్ డోస్ తీసుకున్న వారికి నాసికా వ్యాక్సిన్‌ను అందించలేమని జాతీయ వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్ అధిపతి గతంలో ప్రకటించారు.
మరోవైపు ఈ నాసికా వ్యాక్సిన్ కావాలంటే కోవిన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి డోస్ కోసం అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చని భారత్ బయోటెక్ చెబుతోంది. ప్రస్తుతం దీన్ని బూస్టర్ డోస్ గా తీసుకునేందుకు అవకాశం ఉండటంతో విక్రయాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications