Light Lamp baby: రాత్రి 9 గంటల 9 నిమిషాలకు దీపయజ్ఞం, అంబులెన్స్ లో బిడ్డ, గ్రేట్ !
బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) పై కదనానికి దేశ ప్రజలు సంఘీభావం తెలిపారు. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు దీప కాంతితో భారతావని వెలుగులీనింది. కరోనా వైరస్ రక్కసి అంతానికి దేశ ప్రజలు ఐక్యంగా దీపాలు చేతబూని ప్రతిజ్ఞ చేశారు. కరోనా వైరస్ పై పోరాటానికి సంఘీభావంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన దీపయజ్ఞం విజయవంతం అయ్యింది. దేశం మొత్తం దీప కాంతితో వెలుగుతున్న సమయంలో ఆదివారం రాత్రి 9 గంటల 9 నిమిషాల సమయంలో ఓ మహిళ ఆసుపత్రికి వెలుతున్న సమయంలో అంబులెన్స్ లోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దేశం మొత్తం ఒకే సారి దీపాలు వెలుగించిన సమయంలో పుట్టిన ఆ చిన్నారి చరిత్రలో నిలిచిపోయాడు.
Recommended Video

మారుమూల గ్రామం
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలోని హోసదుర్గ సమీపంలోని అడవిసంగేహళ్ళి గ్రామంలో రేఖ, గురుమూర్తి దంపతులు నివాసం ఉంటున్నారు. రేఖ నిండు గర్బిణి. ఆదివారం రాత్రి రేఖకు పురుటి నొప్పులు ఎక్కువ కావడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

లాక్ డౌన్ ఇబ్బందులు !
కరోనా వైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలోనే రేఖకు పురుటి నొప్పులు ఎక్కువ కావడం ఆమె కుటంబ సభ్యులు ఆందోళన చెందారు. రేఖను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి గ్రామంలో ఎలాంటి వాహనాలు లేకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు అంబులెన్స్ కు ఫోన్ చేశారు.

రాత్రి 9 గంటల 9 నిమిషాలకు
అడవిసంగేహళ్ళి గ్రామానికి అంబులెన్స్ రావడం కొంచెం ఆలస్యం అయ్యింది. అంబులెన్స్ వచ్చిన తరువాత రేఖను హోసదుర్గలోని ఆసుపత్రికి తీసుకెలుతున్నారు. ఆదివారం రాత్రి 9 గంటల 9 నిమిషాలకు ఆసుపత్రికి వెలుతున్న సమయంలో అంబులెన్స్ లో రేఖ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

దీపయజ్ఞం బిడ్డ
కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు దేశం మొత్తం దీపయజ్ఞంకు పిలుపునిచ్చారు. దేశం మొత్తం విద్యుత్ దీపాలు ఆఫ్ చేసి దీపాలు వెలిగించి దేశం మొత్తం ఏకతాటిపై ఉన్న సమయంలో ఆవెలుగులో అంబులెన్స్ లో పుట్టిన మగబిడ్డ నిజంగా అదృష్టవంతుడని చెప్పాలి. ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా అంబులెన్స్ లో పుట్టిన మగబిడ్డ, తల్లి క్షేంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మొత్తం మీద వంద కోట్ల మందికి పైగా ఒకే సారి దీపాలు వెలిగించిన సమయంలో 9 గంటల 9 నిమిషాలకు పుట్టిన ఈ మగబిడ్డ చాలా అదృష్టవంతుడు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ!











Click it and Unblock the Notifications