Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జపాన్ ను దాటేసిన భారత్.. ప్రపంచంలోనే నాలుగో ఆర్థిక వ్యవస్థగా..

ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది. ఈ మేరకు జపాన్ ను దాటేసి నాలుగో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం భారత జీడీపీ విలువ 4.18 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. భారత ఆర్థిక సంస్కరణలు-2025 రిపోర్టు ఆధారంగా .. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.

ఈ నివేదిక ప్రకారం.. 2030 నాటికి భారత్.. జర్మనీను దాటి మూడో స్థానానికి చేరుకుంటుందని పేర్కొంది. ప్రస్తుతం భారత్.. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉంది. 2025-26 ఫలితాల్లో దేశ రియల్ జీడీపీ 8.2 శాతం వరకు చేరుకుంది. ఫస్ట్ క్వార్టర్ ఫలితాల్లో జీడీపీ 7.8 శాతం ఉండగా.. సెకండ్ క్వార్టర్ ఫలితాల్లో జీడీపీ 8.2 శాతానికి చేరడం విశేషం. గతేడాది ఫలితాలతో పోలిస్తే భారీగా వృద్ధి సాధించినట్లు స్పష్టం అవుతోంది.

ఇదే విషయంపై ప్రభుత్వం రిలీజ్ చేసిన నోట్ ప్రకారం.. " భారత జీడీపీ విలువ ప్రస్తుతం 4.18 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. భారత్.. జపాన్ ను అధిగమించింది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో నాలుగో స్థానానికి చేరుకుంది. అలాగే 2030 నాటికి జర్మనీ స్థానాన్ని భారత్ అధిగమించి మూడో స్థానాన్ని కైవసం చేసుకోనుంది. ఆ సమయానికి భారత్ జీడీపీ విలువ 7.3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది" అని పేర్కొంది.

ఇక ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ప్రస్తుతం అమెరికా అగ్రస్థానంలో ఉంది. రెండో స్థానంలో చైనా ఉంది. మూడో స్థానంలో జర్మనీ ఉంది. తాజాగా నాలుగో స్థానాన్ని భారత్ కైవసం చేసుకుంది. భారత్ ఈ స్థానానికి చేరుకోవడానికి ముఖ్యంగా స్వదేశీ డిమాండ్ అలాగే బలమైన ప్రైవేట్ వినియోగం కారణంగా నివేదికలు చెబుతున్నాయి. అలాగే భారత ఆర్థిక ప్రగతిని అంతర్జాతీయ సంస్థలు సమర్థించాయి.

India Overtakes Japan Becomes World s Fourth-Largest Economy with 4 18 Trillion GDP

2026 నాటికి భారత్ 6.5 వృద్ధి రేటును నమోదు చేస్తుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. అలాగే 2026 నాటికి భారత్ 6.5 వృద్ధి రేటును నమోదు చేస్తుందని మూడీస్ సంస్థ పేర్కొంది. జీ 20 దేశాల్లో భారత్ వేగంగా అభివృద్ది చెందుతోందని స్పష్టం చేసింది. అలాగే వచ్చే ఏడాది నాటికి 6.2 వృద్ధి రేటును ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఇక ఓఈసీడీ సంస్థ 2026 నాటికి భారత్ 6.2 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+