అమెరికాలో ఉండే భారతీయులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం

అమెరికాలో నివసించే భారతీయులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఆ దేశానికి అంతర్జాతీయ పోస్టల్ సేవలను పునరుద్ధరించింది. నేటి నుండి అన్ని రకాల పోస్టల్ సేవలు పునః ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. డెలివర్డ్ డ్యూటీ పెయిడ్ కస్టమర్లపై ఎటువంటి అదనపు ఛార్జీలు విధించబోమని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ ధృవీకరించింది. పోస్టల్ టారిఫ్‌లు మారకుండా ఉంటాయని తెలిపింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ నిబంధనల కారణంగా ఆ దేశానికి పోస్టల్ సర్వీసులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టు 25వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్ యాక్ట్ టారిఫ్ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం వాటి విలువతో సంబంధం లేకుండా అంతర్జాతీయ పోస్టల్ వస్తువులన్నింటిపైనా అమెరికా కస్టమ్స్ సుంకాలు విధించింది అమెరికా. 100 డాలర్ల వరకు విలువైన బహుమతులపై మాత్రం టారిఫ్ మినహాయింపు ఉంది.

India Reopens Postal Services to the United States

డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం- అంతర్జాతీయ పోస్టల్ నెట్‌వర్క్ ద్వారా రవాణా చేసే క్యారియర్‌లు లేదా అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) ద్వారా ఆమోదం పొందిన థర్డ్ పార్టీ సంస్థలు.. పోస్టల్ సరుకులపై టారిఫ్ ను వసూలు చేసి, అక్కడి ప్రభుత్వానికి చెల్లించాలి. అధికారిక గుర్తింపు పొందిన థర్డ్ పార్టీలు, టారిఫ్ వసూళ్లు, చెల్లింపు విధానాలకు సంబంధించిన అంశాలు స్పష్టంగా లేవు.

దీని ఫలితంగా- అమెరికాకు వెళ్లే ఎయిర్ క్యారియర్లు ఏవీ కూడా ఈ నెల 25వ తేదీ నుంచే పోస్టల్ పార్సిళ్లను స్వీకరించలేమని ప్రకటించాయి. ఆయా కారణాల వల్ల.. పోస్టల్ శాఖ ఈ నెల 25వ తేదీ నుండి అమెరికాకు వెళ్లే అన్ని రకాల పోస్టల్ ఆర్టికల్స్ బుకింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. ఉత్తరాలు/డాక్యుమెంట్లు, 100 అమెరికన్ డాలర్ల వరకు విలువైన బహుమతులకు ఈ నిలిపివేత వర్తించదు. వీటికి మినహాయింపు ఉంది.

తాజాగా అమెరికాకు పోస్టల్ సర్వీసులను పునరుద్ధరించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు అన్ని రకాల అంతర్జాతీయ మెయిల్, ఎక్స్ ప్రెస్ మెయిల్స్, ఎయిర్ పార్సిల్స్, రిజిస్టర్డ్ లెటర్స్/ప్యాకెట్స్, ట్రాక్డ్ ప్యాకెట్స్ ను అమెరికాకు బుక్ చేసుకోవచ్చు. పోస్టాఫీసులు, ఇంటర్నేషనల్ బిజినెస్ సెంటర్, డాక్ ఘర్ నిర్యాత్ కేంద్ర లేదా www.indiapost.gov.inలోని సెల్ఫ్-సర్వీస్ పోర్టల్ ద్వారా అమెరికాకు తమ పార్సిళ్లను పంపించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+