దేశంలో అత్యంత సురక్షితమైన టాప్ 10 నగరాలు ఇవే.. హైదరాబాద్ ఎక్కడుందో తెలుసా..?

ప్రస్తుతం ఎక్కడ చూసినా అల్లర్లు, విధ్వంసం, అనిశ్చితి నెలకొన్నాయి. అలాగే ప్రకృతి వైపరిత్యాలూ ముంచుకొస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలు ముంచెత్తున్నాయి. మరోవైపు ట్రాఫిక్, కాలుష్యం సమస్య కూడా విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో మానవుడు సురక్షితంగా జీవించ గల చోటు ఏది అనేది ప్రశ్నార్థకంగా మారింది. చోరీలు, మహిళలపై దాడులు, డ్రగ్స్ దందా.. ఇలాంటి సమస్యలతో ప్రజల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.

ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా సురక్షిత దేశాలు, నగరాలపై అధ్యయనం చేసిన ప్రముఖ సంస్థ నంబియో సేఫ్టీ ఇండెక్స్ తాజాగా 2025 సంవత్సరానికి సంబంధించిన సేఫ్టీ ఇండెక్స్ నివేదికను విడుదల చేసింది. ఈ రిపోర్టులో ప్రజల భద్రత, నేరాల తీవ్రత, మహిళలపై దాడుల రేటు, దొంగతనాలు, మాదక ద్రవ్యాల వినియోగం తదితర అంశాలను ఆధారంగా తీసుకుంది. ఇక నంబియో సేఫ్టీ ఇండెక్స్ విడుదల చేసిన జాబితా ప్రకారం భారత్‌ లో టాప్‌-10 సురక్షితమైన నగరాల జాబితాలో కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు తొలి స్థానాన్ని దక్కించుకుంది. అలాగే రెండో స్థానంలో గుజరాత్‌ లోని వడోదర నిలిచింది.

India s Top 10 Safest Cities in 2025 Hyderabad s Impressive Ranking Revealed

ఇక ఈ జాబితాలో అహ్మదాబాద్‌ మూడో స్థానంలో నిలిచింది. అదే రాష్ట్రానికి చెందిన సూరత్‌ నాలుగో స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ఇక ఈ జాబితాలో రాజస్థాన్ రాజధాని జైపూర్‌ ఐదో స్థానంలో.. మహారాష్ట్ర రాజధాని నవీ ముంబై ఆరో స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. మహారాష్ట్రలోని పూణె తొమ్మిదో స్థానంలో.. అలాగే చండీఘడ్‌ 10వ స్థానంలో నిలిచింది. ఇక భారత రాజధాని దిల్లీ మాత్రం చివరి స్థానంలో ఉంది. అయితే టాప్ 10 స్థానాల్లో హైదరాబాద్ కు చోటు దక్కక పోవడం గమనార్హం. ఇక అత్యంత సురక్షితమైన దేశాల జాబితాలో భారత్‌ 67వ స్థానంలో నిలిచింది. ఈ ర్యాంకింగ్స్ లో ఇండియా 55.8 స్కోర్ సాధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+