ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గిన భారత్: రష్యాకు గుడ్ బై?: అక్కడి నుంచి క్రూడాయిల్ పర్ఛేజ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిళ్లకు భారత్ తలొగ్గినట్టే కనిపిస్తోంది. మిత్రదేశం రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతులను తగ్గించుకోనుంది. దీనికి బదులుగా ట్రంప్ సూచించిన విధంగా వెనిజులా నుంచి ఆయిల్ కొనుగోలు చేయనుంది. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది. ఇంధన దిగుమతులపై తీసుకునే నిర్ణయాలు వాణిజ్య, దీర్ఘకాలిక ప్రయోజనాలు, అవసరాలపై ఆధారపడి ఉంటాయని

గురువారం ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడారు. వెనిజులా నుంచి ఆయిల్ ను కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తోన్నామని అన్నారు. దీంతో పాటు ఇతర క్రూడాయిల్ సరఫరా దేశాలతో వాణిజ్యపరమైన సాధ్యాసాధ్యాలను అన్వేషించనున్నామని చెప్పారు. ఇంధన రంగంలో భారత్ కు చిరకాల భాగస్వామిగా కొనసాగుతోంది వెనిజులా. వాణిజ్యం, పెట్టుబడులు రెండింటిలోనూ ఈ రెండు దేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి.

MEA set to Opens Door to New Crude Oil for Venezuela and Other Options to Bolster Energy Security

2019-20 వరకు భారత్ కు ప్రధాన ముడిచమురు సరఫరాదారులలో ఒకటిగా ఉండేది. అంతర్జాతీయ ఆంక్షల కారణంగా అప్పట్లో వెనిజులా నుండి దిగుమతులు నిలిచిపోయాయి. భారత్ తన ఇంధన భద్రతా వ్యూహానికి అనుగుణంగా, ఏదైనా కొత్త క్రూడాయిల్ సరఫరాదారులతో వాణిజ్యపరమైన లాభాలను అంచనా వేయడానికి సిద్ధంగా ఉన్నామని రణధీర్ జైస్వాల్ పునరుద్ఘాటించారు.

రష్యా నుంచి చమురు దిగుమతులపై అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. మార్కెట్ పరిస్థితులు, మారతున్న ప్రపంచ పోకడలకు అనుగుణంగా క్రూడాయిల్ వనరులను ఎంపిక చేసుకుంటామని, ఇతర దేశాలపైనా వ్యూహాత్మక కొనుగోళ్లకు సిద్ధంగా ఉంటామని అన్నారు. ఇంధన సేకరణకు సంబంధించిన అన్ని నిర్ణయాలు ఈ లక్ష్యంతోనే తీసుకున్నామని, భవిష్యత్తులో కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తామని పేర్కొన్నారు.

అమెరికా టారిఫ్ గురించి అడిగిన ప్రశ్నలకు జైస్వాల్ బదులిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ అనంతరం ఇరుపక్షాలు విడుదల చేసిన ప్రకటనలను ప్రస్తావించారు. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు ఇప్పుడు 18 శాతం తగ్గిన టారిఫ్ అమెరికా మార్కెట్‌లోకి ప్రవేశిస్తాయని అన్నారు. ఈ వాణిజ్య ఒప్పందం- దేశ ఎగుమతులకు, ముఖ్యంగా శ్రమ-ఆధారిత రంగాలకు గణనీయమైన ప్రోత్సాహాన్ని ఇస్తుందని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+