అద్భుతం!: అవినీతి పోటీలో కూడా దూసుకెళ్లిన భారత్!
International Anti-Corruption Day: టాలీవుడ్ ప్రముఖ హీరో నటించిన ఓ సినిమాలో.. 'ఎక్కడ చూసినా లంచం, లంచం, లంచం' అనే డైలాగ్ ప్రతి ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది. అలాగే దేశంలో కూడా అవినీతి రూపురేఖలు మర్రి ఊడల్లా పెరిగిపోయాయి. ఆశ చూపించకపోవతే పని కాని పరిస్థితి ఏర్పడింది. ప్రపంచవ్యాప్తం ప్రతి ఏడాది డిసెంబర్ 9న అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే గత దశాబ్ధంలో ఇండియాలో అవినీతి స్థాయి నిరంతరం పెరుగుతోందని ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ నివేదిక వెల్లడించింది.
ఈ సంస్థ ప్రతి సంవత్సరం ప్రపంచ దేశాల అవినీతిపై నివేదికను విడుదల చేస్తుంది. ఈ నివేదికలో డెన్మార్క్, ఫిన్లాండ్ వంటి దేశాలు చాలా ఏళ్లుగా అవినీతి రహిత దేశాల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఇండియా ర్యాంకింగ్ క్రమంగా పడిపోతూ వస్తోంది.

10 ఏళ్లలో 20 ర్యాంకులు పతనం
ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ 2024 నివేదిక ప్రకారం.. ప్రపంచంలోని 180 దేశాలలో అవినీతి విషయంలో భారతదేశం 96వ స్థానంలో ఉంది. గత ఐదేళ్లలో 2021, 2022లలో 85వ స్థానంలో ఉన్న భారత్... 2023లో 93కి, 2024లో మరింత దిగజారి 96వ స్థానానికి చేరుకుంది. ఇది దేశంలో అవినీతి స్థాయి పెరిగిందనడానికి నిదర్శనం.
*2015 -76వ ర్యాంకు
*2018 -78వ ర్యాంకు
*2020 -86వ ర్యాంకు
*2023 -93వ ర్యాంకు
*2024 -96వ ర్యాంకు
పాకిస్తాన్ పరిస్థితి మరింత దారుణం
ఇండియా పొరుగు దేశమైన పాకిస్తాన్‌లో కూడా గత పదేళ్లలో అవినీతి స్థాయి పెరిగింది. 2015లో 117వ స్థానంలో ఉన్న పాకిస్తాన్... 2021లో 140వ స్థానానికి పడిపోయింది. 2024లో 135వ స్థానంలో ఉన్నప్పటికీ, గత పదేళ్లలో ఇక్కడ అవినీతి స్థాయి పెరిగిందని నివేదిక స్పష్టం చేసింది.
*2015 -117వ ర్యాంకు
*2021 -140వ ర్యాంకు
*2024 -135వ ర్యాంకు
అవినీతిపై చెైనా నియంత్రణ
భారత్, పాకిస్తాన్‌లకు విరుద్ధంగా ఈ నివేదికలో చైనా ర్యాంకింగ్స్‌లో గణనీయమైన మెరుగుదల కనిపించింది. 2015లో 83వ స్థానంలో ఉన్న చైనా... 2024 నాటికి 76వ స్థానానికి చేరుకుంది. ఈ మధ్యకాలంలో కొన్ని హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, మొత్తం మీద చైనా అవినీతిపై గణనీయమైన నియంత్రణ సాధించిందని నివేదిక పేర్కొంది.
*2015 -83వ ర్యాంకు
*2021 -66వ ర్యాంకు
*2024 -76వ ర్యాంకు
గత పదేళ్లలో భారత్, పాకిస్తాన్‌లలో అవినీతి పెరగగా, చైనా మాత్రం దానిపై ప్రభావవంతంగా నియంత్రణ సాధించింది.
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications