భారత్ లో ఆకలి కేకలు ! పాక్, బంగ్లా, శ్రీలంకే నయం- గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో 107/121వ స్ధానం
ప్రపంచ వ్యాప్తంగా కరోనా తర్వాత పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న దేశాల్లోనూ పరిస్ధితులు తలకిందులవుతున్నాయి. దీనికి సరైన ఉదాహరణ తాజాగా ప్రకటించిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ర్యాంకులే. ఇెందులో భారత్ ర్యాంకు చూస్తే వాస్తవ పరిస్దితి అర్ధమవుతుంది.
తాజాగా ప్రకటించిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (ప్రపంచ ఆకలి సూచీ)లో మొత్తం 121 దేశాలు చేరాయి. అంటే ఈ దేశాల్లో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయని అర్ధం. ఈ దేశాల జాబితాలో భారత్ ఏకంగా 107వ స్ధానంలో నిలిచింది.తీవ్ర ఆకలికేకలతో సతమతం అవుతున్న దేశాల జాబితా తీస్తే ఇందులో భారత్ కంటే ఇతర దేశాలు ఎంతో మెరుగ్గా కనిపిస్తున్నాయి.
విచిత్రంగా ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో భారత్ కంటే మిగతా ఉపఖండపు దేశాలన్నీ కింది స్దానంలోనే ఉన్నాయి . పాకిస్తాన్(99), బంగ్లాదేశ్(84), శ్రీలంక(64), నేపాల్ (81)వ స్ధానంలో నిలిచాయి. వాటితో పోలిస్తే భారత్ లోనే ఆకలి కేకలు మిన్నంటుతున్నాయని తెలుస్తోంది.

అలాగే దక్షిణాసియాలో చూస్తే భారత్ కంటే ఎక్కువగా ఆకలి కేకలు కనిపిస్తున్న దేశం ఆప్ఘనిస్తాన్ (109) మాత్రమే. దీంతో ఉపఖండంలో ఆప్ఘన్ మాత్రమే మన కంటే ఎక్కువగా ఆకలితో సతమతం అవుతున్నట్లు తెలుస్తోంది. దీని వెనుక పలు కీలక కారణాలు ఉన్నాయి.
గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది ప్రపంచ, ప్రాంతీయ , జాతీయ స్థాయిలలో ఆకలిని సమగ్రంగా కొలవడానికి, ట్రాక్ చేయడానికి ఓసాధనం. జీహెచ్ఐ స్కోర్‌లు నాలుగు అంశాలపై ఆధారపడి ఉంటాయి. పోషకాహార లోపం, పిల్లల పెరుగుదల, పిల్లల వృధా, పిల్లల మరణాలు. ఈ స్కోర్ ఆకలి తీవ్రతను ప్రతిబింబించే 100-పాయింట్ స్కేల్‌లో లెక్కిస్తారు. ఇక్కడ సున్నా వస్తే ఉత్తమ స్కోర్ (ఆకలి లేదని) అలాగే 100 వస్తే చెత్తగా ఉన్నట్లు అర్ధం.
-
మొదటి రోజే పరువు పాయే! తెల్ల బంతి కాస్తా గులాబీగా మారింది! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
పాకిస్తాన్కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
ముగిసిన రంజాన్ సెలవులు.. మరోసారి పాకిస్థాన్ భీకర దాడి -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు












Click it and Unblock the Notifications