29 మందితో వెళ్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం అదృశ్యం
చెన్నై: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం ఏఎన్ 32 గల్లంతయింది. విమానంలో 29 మంది సిబ్బంది ఉన్నట్లుగా తెలుస్తోంది. చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్ వెళ్తుండగా హఠాత్తుగా శుక్రవారం ఉదయం ఏటీసీతో ఆ విమానానికి సంబంధాలు తెగిపోయాయి.

విమానం కోసే నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విమానం చెన్నైలోని తంబరం నుంచి ఉదయం 8.30 గంటలకు గాల్లోకి ఎగిరింది. ఆ తర్వాత పదహారు నిమిషాలకు సంబంధాలు తెగిపోయాయి.












Click it and Unblock the Notifications