వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేగం పుంజుకున్న భారత ఆర్థిక వ్యవస్థ... భారీగా పెరగనున్న ఉద్యోగుల జీతాలు..!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : ఉద్యోగులందరికీ శుభవార్త. ఈ ఏడాది జీతాల్లో భారీ వృద్ధి నమోదుకానుంది. గతేడాది సింగిల్ డిజిట్ గా ఉన్న పెరుగుదల ఈసారి రెండంకెలకు చేరుకోనుందట. ఆర్థిక వ్యవస్థ శరవేగంగా వృద్ధి చెందుతున్న కారణంగా ఇది సాధ్యమవుతుందని చెబుతోంది గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ కార్న్ ఫెర్రీ నివేదిక.

దేశ ఆర్థిక వ్యవస్థలో వృద్ధి శరవేగంగా నమోదవుతున్న తరుణంలో వేతన పెరుగుదల అత్యధికంగా ఉంటోందట. యాక్చువల్ శాలరీ ఇంక్రిమెంట్ ఆసియాలోనే అధికమంటున్నారు కార్న్ ఫెర్రీ ఇండియా ఛైర్మన్. పోయినేడాది జీతాల పెరుగుదల 9 శాతంగా ఉంది. అది ఈసారి 10 శాతానికి పెరగొచ్చు అనేది ఆ నివేదిక సారాంశం. పెరిగే ద్రవ్యోల్యణం లెక్కల్లోకి తీసుకుంటే యాక్చువల్ శాలరీ ఇంక్రిమెంట్ 5 శాతంగా ఉండొచ్చట. గతేడాది ఇది 4.7 శాతంగా నమోదైంది.

 Indian employees may see double digit salary growth

ఆసియాలో ఈ ఏడాది వేతనాల వృద్ధి 5.6 శాతానికి పెరగొచ్చు. గతేడాది 5.4 శాతంగా నమోదైంది. ద్రవ్యోల్బణ సర్దుబాటు తర్వాత యాక్చువల్ శాలరీ ఇంక్రిమెంట్ 2.6 శాతంగా ఉండనుంది. ఇది చూసినట్లయితే వరల్డ్ లోనే అత్యధికంగా కనిపిస్తుంది. 2.8 శాతం నమోదైన గతేడాదితో పోలిస్తే మాత్రం ఇది తక్కువే.

యూకేలో వాస్తవ వేతన పెరుగుదల 0.6 శాతం, జపాన్‌లో 0.1 శాతం, సింగపూర్‌లో 3 శాతం, చైనాలో 3.2 శాతం, ఇండోనేషియాలో 3.7 శాతం, వియత్నాంలో 4.8 శాతం గా ఉండనుంది. ఇక తూర్పు యూరప్ లోని ఉద్యోగుల వేతనాల సగటు పెరుగుదల 6.6 శాతం ఉండనుంది. ద్రవ్యోల్బణం లెక్కల్లోకి తీసుకుంటే యాక్చువల్ శాలరీ ఇంక్రిమెంట్ 2 శాతంగా ఉండొచ్చని చెబుతోంది కార్న్ ఫెర్రీ నివేదిక.

English summary
Indian employees may see double digit salary growth in this financial year. Result of rapid economic growth may happen in india a global consluting firm released report. India continues to enjoy the highest overall salary increases and real wage growth in asia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X