Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Rinku Singh: భావోద్వేగాని గురైన రింకూ సింగ్.. వైరల్ అవుతోన్న వీడియో..

పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీలో భారత జట్టు నేడు ఐర్లాండ్ తో తలపడనుంది. మూడు టీ20 ల్లో భాగంగా శుక్రవారం రాత్రి 7:30 గంటలకు ఐర్లాండ్ తో తలపడనుంది. భారత జట్టులో యువకులతో నిండిపోయింది. ఐపీఎల్ రాణించిన తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ, శివమ్ దూబె లు ఐర్లాండ్ చేరుకున్నారు. తిలక్ వర్మ వెస్టిండిస్ తో జరిగిన టీ20 అరంగేట్రం చేశాడు. శుక్రవారం రింక్ సింగ్, జితేశ్ శర్మ టీ20 అరంగేట్రం చేసే అవకాశం ఉంది.

రింకూ సింగ్ ఐర్లాండ్ కు వెళ్తున్న విమానంలో బిజినెస్ క్లాస్ లో ప్రయాణం చేశాడు. బిజినెస్ క్లాస్ లో ప్రయాణం చేయడంపై రింకూ భావోద్వేగానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో టీజర్ ను బీసీసీఐ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. వీడియోను బీసీసీఐ వెబ్ సైట్ ఉంచింది. రింకూ సింగ్ జితేశ్ శర్మతో మాట్లాడుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. తన దేశం తరఫున ఆడాలని ప్రతి ఒక్క ఆటగాడికి ఉంటుందని రింకూ సింగ్ అన్నాడు.

Rinku Singh

తను నోయిడాలో స్నేహితులతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు టీమిండియాకు ఎంపికైనట్లు సమాచారం వచ్చిందన్నాడు. వెంటనే తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పినట్లు వివరించాడు. తన పేరుతో ఉన్న జెర్సీని, నంబర్ ను చూసి కన్నీళ్లొచ్చాయని రింకూ సింగ్ భావోద్వేగంగా చెప్పాడు. కాగా జితేశ్ శర్మ, రింకూ సింగ్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకలో ఒకేసారి అరంగేట్రం చేశారు. ఇప్పుడు భారత్ తరఫున టీ20ల్లో ఒకేసారి డె్బ్యూ చేసే అవకాశం వచ్చింది.

"నేను, జితేశ్ శర్మ 10 ఏళ్ల కిందట ఒకేసారి సయ్యద్ ముస్తాక్ ట్రోఫీలో అడుగు పెట్టాం. తాజాగా భారత జట్టుకు ఎంపిక కావడం సంతోషంగా ఉంది" అని రింకూ సింగ్ తెలిపాడు. ఐర్లాండ్ పర్యటనలో జితేశ్ శర్మ ఇంగ్లిష్ సాయంగా ఉంటాడని రింకూ చమత్కారించాడు. తుది జట్టులో స్థానం లభిస్తే విజయం కోసం 100 శాతం ప్రయత్నాం చేస్తామని రింకూ సింగ్ చెప్పాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+