H1B Visa స్టాపింగ్ లో బిగ్ టర్న్.. ఆ తప్పు చేస్తే 300 డాలర్ల ఫైన్

అమెరికాకు బయలుదేరి వెళ్లిన ఓ భారతీయుడికి బిగ్ షాక్ తగిలింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలోని అమెరికా ప్రీ క్లియరెన్స్‌ అధికారులు అతనిపై భారీ జరిమానా విధించారు. అమెరికాకు తీసుకెళ్తోన్న లగేజీలో పంది మాంసం ఫ్రై, కొన్ని రకాల పచ్చళ్లు ఉన్నాయనే విషయాన్ని ముందుగా చెప్పకపోవడంతో అతనిపై 300 డాలర్ల ఫైన్ కట్టాల్సొచ్చింది. ఈ విషయాన్ని ఓ సోషల్ మీడియా యూజర్ తెలిపాడు.

తాను తీసుకెళ్తున్న ఆహార పదార్థాల గురించి ముందుగా డిక్లరేషన్ ఇవ్వకపోవడం వల్ల జరిమానా పడిందని తెలిపాడు. భవిష్యత్తులో అది తన వీసా స్థితిపై ఎలాంటి ప్రభావం చూపుతుందోననే ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ జరిమానా తన వీసాపై ప్రతికూల ప్రభావం చూపుతుందా లేదా అని ఇతర సోషల్ మీడియా యూజర్లను అడిగాడు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా సలహాలను ఇచ్చారు. జరిమానా చెల్లించడం కొంత ప్రభావం చూపుతుందని పేర్కొంటోన్నారు.

Indian Traveler Faces 300 Dollar Fine for Undeclared Food at US Pre-Clearance

అబుదాబి విమానాశ్రయంలోని యూఎస్ ప్రీక్లియరెన్స్ సమయంలో అధికారులు తమ వద్ద ఏమైనా ఆహార పదార్థాలు ఉన్నాయా అని ప్రశ్నించారని, తాము ఊరగాయలు, స్నాక్స్, మసాలా పొడులు తీసుకెళ్తున్నట్లు కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) అధికారులకు వివరించానని చెప్పాడు. వీటి గురించి మరింత ప్రశ్నించగా, చేపలు, బీఫ్ తో తయారు చేసిన ఊరగాయలు ఉన్నాయని తెలిపాడు. దీంతో అధికారులు రెండోసారి తనిఖీ చేశారు. వారి బ్యాగులను తెరిచి చూశారు. దీంతో- పంది మాంసం ఫ్రై ప్యాకెట్ కనిపించింది.

దీని గురించి ముందే వెల్లడించనందుకు వారికి 300 డాలర్ల జరిమానా విధించారు. తాను ఉద్దేశపూర్వకంగా ఈ విషయాన్ని దాచలేదని, ఆ సమయంలో అది గుర్తుకు రాలేదని, నిజంగా తన పొరపాటేనని, పంది మాంసం ఫ్రై కూడా స్నాక్స్ కిందకే వస్తుందని భావించానని ఆ ప్రయాణికుడు స్పష్టం చేశాడు. అమెరికాకు చేరుకున్నాక వారు బీఫ్ ఊరగాయను పారవేశారని, చేపలతో తయారుచేసిన పికిల్స్ ను వెంట తీసుకెళ్లడానికి అనుమతి ఇచ్చారని అన్నాడు.

బీఫ్, పంది మాంసం ఇంట్లో తయారుచేసినవని, అందుకే వాటిపై ఎటువంటి సీల్ లేదని చెప్పాడు. చేపలతో తయారుచేసిన పికిల్స్ షాప్ లో కొన్నానని, వాటిపై సీల్ కూడా ఉందని వివరించాడు. సీల్ ఉండటం వల్ల దీన్ని తీసుకెళ్లడానికి అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నాడు. ఈ సంఘటన తన వీసా లేదా H-1B స్టాంపింగ్‌పై ప్రభావం చూపుతుందా అని ఆ ప్రయాణికుడు ఆందోళన వ్యక్తం చేశాడు. సోషల్ మీడియా యూజర్లు ఇది అతని నివాసం లేదా H-1B వీసాకు సమస్యగా మారదని, అయితే CBP రికార్డులో ఉంటుందని, భవిష్యత్తులో అతడిని అదనంగా తనిఖీ చేస్తారని వివరణ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+