ఓల్డ్ మోడల్ క్లాసిక్ TATA SUV కారు రీలాంచ్.. !!
టాటా మోటార్స్ కు చెందిన సియెర్రా దేశీయ మార్కెట్ లో రీఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ నెల 25వ తేదీన ఇది లాంచ్ కాబోతోంది. ఈ ఎస్‌యూవీ 1.5-లీటర్ టర్బో-పెట్రోల్, 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌లతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కొత్తగా రూపుదిద్దుకుంటోన్న ఫస్ట్ బ్యాచ్ కార్లను భారత మహిళా జట్టుకు బహుమతిగా అందజేయనుంది. ఒక్కో ప్లేయర్ ఒక్కో కారును గిఫ్ట్ గా అందుకోనున్నారు. లాంచ్ అయిన వెంటనే ఫస్ట్ బ్యాచ్ కార్లను వారికి ఇవ్వనుంది టాటా మోటార్స్.
ఈ విషయాన్ని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శైలేష్ చంద్ర వెల్లడించారు. ఐసీసీ మహిళ వరల్డ్ కప్ లో అద్భుత ప్రదర్శన చేశారని, ఈ విజయాన్ని వారితో కలిసి పంచుకోవాలనుకుంటోన్నామని అన్నారు. ఇందులో భాగంగా వరల్డ్ కప్ గెలిచిన జట్టులోని ప్రతి మహిళ క్రికెటర్ కు ఒక్కో సియెర్రా కారును బహుమతిగా అందజేయనున్నామని చెప్పారు. మహిళల వరల్డ్ కప్ లో వారి ప్రయాణం దేశం పట్ల నిబద్ధత, విశ్వాసం.. ప్రతి భారతీయుడికీ స్ఫూర్తినిస్తాయని ప్రశంసించారు.

ఈ విమెన్స్ లెజెండరీ ఆటగాళ్లకు మరో లెజెండ్ అయిన టాటా సియెర్రాను బహుమతిగా ఇవ్వడం తమ సంస్థకు గర్వకారణమని శైలేష్ చంద్ర చెప్పారు. వారి స్ఫూర్తికి, దేశానికి తెచ్చిన గౌరవానికి ఇదో చిరు కానుక అని పేర్కొన్నారు. మహిళ జట్టు సాధించిన తిరుగులేని విజయం తరహాలోనే తమ సియెర్రా కారు కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఫస్ట్ బ్యాచ్ కార్లను వారికి బహూకరిస్తామని చెప్పారు.
కొత్తగా రాబోతున్న టాటా సియెరా ఎస్‌యూవీ డిజైన్, ఫీచర్లలో అనేక ప్రత్యేకతలతో రీలాంచ్ కాబోతోంది. దీని ధర సుమారు రూ.11 లక్షల నుంచి రూ.25 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండొచ్చు. ఇది మొదటగా ఐసీఈ (పెట్రోల్/డీజిల్) ఇంజిన్ ఆప్షన్‌లో, ఆ తర్వాత ఎలక్ట్రిక్ (EV) పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌లోనూ అందుబాటులోకి వస్తుందని సమాచారం. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన టీజర్ విడుదల అయింది కూడా.
ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, డీఆర్‌ఎల్, టెయిల్ ల్యాంప్స్, ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, స్టైలిష్ అల్లాయ్ వీల్స్‌తో అద్భుతమైన డిజైన్.. దీని ప్రత్యేకత. ఈ ఎస్‌యూవీలో అత్యంత ముఖ్యమైన ఫీచర్ ట్రిపుల్ స్క్రీన్ సెటప్. అంటే- డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, టచ్‌స్క్రీన్ సెంట్రల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్యాసింజర్-సైడ్ డిస్‌ప్లే ఉంటుందిందులో. స్టీరింగ్ వీల్‌పై టాటా లోగో, టచ్ బేస్డ్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.
ఈ కారులో మొత్తం ఏడు ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి. ఏబీఎస్ , ఈబీడీ, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, టీపీఎంఎస్, 360-డిగ్రీ కెమెరా వంటి అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. ఈ కారులో 5- సీటింగ్ ఆప్షన్ ఉంటుంది. కొత్త టాటా సియెరా మార్కెట్‌లో అనేక ఇతర ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది. మారుతి సుజుకి విక్టోరిస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, హ్యుందాయ్ క్రెటా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, హోండా ఎలివేట్, మహీంద్రా స్కార్పియో క్లాసిక్, స్కోడా కుషాక్ వంటి అనేక కార్లు దీనికి ప్రధాన ప్రత్యర్థులుగా నిలవనున్నాయి.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications