Video: ఇస్రో చీఫ్ సోమనాథ్‌కు ఇండిగో విమానంలో ఆత్మీయ స్వాగతం
బెంగళూరు: చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంతో ప్రపంచ వ్యాప్తంగా భారత్, ఇస్రో శాస్త్రవేత్తలపై అభినందనలు, ప్రశంసలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ఇండిగో విమానం ఎక్కిన వీడియోను విమాన సిబ్బంది పంచుకున్నారు. ఆయనకు ఇండిగో విమాన సిబ్బంది అపూర్వ స్వాగతం పలికారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో-ISRO) ఛైర్మన్ సోమనాథ్ గురువారం ఇండిగో విమానంలో ప్రయాణించారు. దీంతో విమానం టేకాఫ్‌కు ముందు ఆయనను గౌరవిస్తూ సిబ్బంది ప్రత్యేక అనౌన్స్‌మెంట్ చేశారు. 'ఈ రోజు విమానంలో మనతోపాటు ప్రత్యేక వ్యక్తి ఉన్నారు. మీరు బోర్డులో ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మీకు సేవలందించే అవకాశం రావడం విశేషంగా భావిస్తున్నాం. దేశం గర్వపడేలా చేసినందుకు ధన్యవాదాలు' అని ప్రయాణికులంతా చప్పట్లతో ఆయనకు స్వాగతం పలికారు.

ఆ తర్వాత ఎయిర్ హోస్టెస్ ఆయనకు ఫుడ్ ట్రేతోపాటు ఒక గ్రీటింగ్ కార్డును అందించింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. మరోవైపు, రాఖీ పండగ రోజును ప్రత్యేక గురించి తెలుపుతూ మరో ట్వీట్ చేసింది.
సోదర, సోదరీమణులకు ప్రత్యేక పండగంటే రాఖీనే. కానీ, ఈ బిజీ ప్రపంచంలో ఉద్యోగ రీత్యా దూరంగా ఉన్న ఎంతో మంది తోబుట్టువులు రాఖీ పండగను జరుపుకోలేకపోతున్నారు. కానీ, ఇక్కడ ఒక అక్క, తమ్ముడి జంట రాఖీ పండగను విమానంలో జరుపుకునే అవకాశం లభించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇండిగో ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. ఎంత ఎత్తులో ఉన్న తోబుట్టువులకు ఈరోజు ప్రత్యేకమని వ్యాఖ్యానించింది.
At 30,000 feet or on the ground, the bond of a brother and sister remains special.
— IndiGo (@IndiGo6E) August 30, 2023
A heartwarming moment on board today as our Check Cabin Attendant Shubha celebrates Rakhi with her brother Capt. Gaurav. #HappyRakshaBandhan2023 #HappyRakhi #goIndiGo #IndiaByIndiGo pic.twitter.com/WoLgx8XoIa
వీడియోలో విమానం టేకాఫ్ అయ్యేముందు ఇండిగో స్టాఫ్ శుభ ప్రయాణికులకు ప్రత్యేక ప్రకటన చేసింది. ఉద్యోగరీత్యా దూరంగా ఉండటం వల్ల మేము కొన్ని పండగలు జరుపుకోలేకపోయాం. కానీ, ఈరోజు నాకు మా సోదరుడికి ప్రత్యేకమైన రోజు. చాలా ఏళ్ల తర్వాత కలిసి రక్షాబంధన్ జరుపుకుంటున్నాం అని సోదరుడు కెప్టెన్ గౌరవ్‌కు రాఖీ కట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications