టెక్కీలకు ఇన్పోసిస్ శుభవార్త: ప్రతి ఏటా 6 వేల మందికి ఉద్యోగాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగుళూరు: ఐటీ దిగ్గజం ఇన్పోసిస్ వచ్చే రెండేళ్ళలో ఏటా ఆరువేల మందికి ఉద్యోగాలను కల్పించనున్నట్టు ప్రకటించింది. ఇన్పోసిస్‌లో ఇటీవల చోటుచేసుకొన్న సంక్షోభాలు రిక్రూట్‌మెంట్‌పై ఎలాంటి ప్రభావం చూపబోవని తేలింది.

విశాల్ సిక్కా ఇన్పోసిస్ సిఈఓ పదవికి రాజీనామా చేయడం, శేషసాయి లేఖ తదితర వివాదాలు ఇన్పోసిస్‌ తీవ్ర సంక్షోభంలో ఉందనే ప్రచారం నెలకొంది. ఈ విషయమై కార్పొరేట్‌ రంగంలో కూడ తీవ్ర చర్చ కూడ జరిగింది ఇన్ఫోసిస్‌. వచ్చే రెండేళ్లలో ఏటా ఆరు వేల మందికిపైగా కొత్త ఇంజినీర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు కంపెనీ తెలిపింది.

Infosys to hire 6,000 engineers annually over next 2 years

ఉద్యోగ వీసాకు సంబంధించి వివాదాలు ఉన్నా, యూఎస్‌, యూరోపియన్‌ మార్కెట్లో ఉద్యోగ నియామక ప్రక్రియను కొనసాగిస్తామని ఇన్పోసిస్ ప్రకటించింది.
ఈ ఏడాది కొత్తగా ఆరు వేలమందికి ఉపాధి కల్పించనున్నాం. వచ్చే రెండేళ్లలో కూడా ఇదే విధంగా నియామకాలు ఉంటాయని ఆ కంపెనీ ప్రకటన చేసింది. ఈ మేరకు ఇన్పోసిస్ తాత్కాలిక సీఈవో, ఎండీ యూబీ ప్రవీణ్‌రావు ప్రకటించారు.

ఏటా 10లక్షల మంది గ్రాడ్యుయేట్‌లు విశ్వవిద్యాలయాల నుంచి బయటకు వస్తున్నారని, వీరిలో కేవలం 20-30శాతం మంది మాత్రమే నైపుణ్యం కలిగి ఉన్నారని చెప్పారు.ఈ ఏడాది జూన్‌ నాటికి ఇన్ఫోసిస్‌లో మొత్తం 1,98,553మంది ఉద్యోగులు ఉన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Unfazed by the recent upheavals at the board, Infosys will continue to hire about 6,000 engineers annually over next 1-2 years, same as last fiscal, according to a top company official.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి