'రామ్‌కుమార్ ఎవరో తెలియదట': స్వాతి మర్డర్ కేసులో వైరల్‌లా వీడియో
చెన్నై: చెన్నై నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో హత్యకు గురైన ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతి కేసుకు సంబంధించిన మిస్టరీ వీడకముందే పలు సంచలనాలు సృష్టిస్తోంది. స్వాతి కేసులో ఇప్పటికే తమిళచ్చి అనే మహిళ ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా రామ్ కుమార్‌కు ఎలాంటి సంబంధం లేదంటూ పలు ఆధారాలతో కూడిన ఓ వీడియోను విడుదల చేసింది.
అంతేకాదు ఈ కేసులో సంబంధం ఉన్న ఓ మహిళను పోలీసులు హతమార్చాలనే ప్లాన్‌లో ఉన్నారని, దీనికి సంబంధించిన ఓ ఆడియోను కూడా తమిళచ్చి విడుదల చేసింది. స్వాతి మర్డర్ కేసుతో సంబంధం ఉన్న మురుగానందం అనే వ్యక్తికి సంబంధించిన వివరాలను కూడా తమిళచ్చి తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేసింది.

ఈ వివరాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. గతంలో టెక్కీ స్వాతి, రామ్ కుమార్ ఇద్దరూ ఫేస్ బుక్ స్నేహితులంటూ, వారిద్దరూ ఫేస్‌బుక్‌లో చాటింగ్ చేస్తుండేవారి పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఫేస్‌బుక్‌లో స్వాతిని చూసిన రామ్ కుమార్ ఆమె కోసమే చెన్నై వచ్చాడని, ఆమె వెంటపడ్డాడని మీడియాలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
రామ్ కుమార్.. స్వాతిని ఫేస్‌బుక్‌లో చూసి ప్రేమలో పడటం.. ఆ తర్వాత ఆమె అందుకు నిరాకరించడంతో హత్య చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. స్వాతి మర్డర్ కేసులో అరెస్టైన రామ్ కుమార్ చెన్నైలోని పుళల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. తమిళచ్చి తన ఫేస్‌బుక్ అకౌంట్లో పోస్ట్ చేసిన ఆడియో ప్రస్తుతం నెట్‌లో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications