చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘స్వాతి హత్య పట్ల రామ్‌కుమార్ పశ్చాత్తాపం: కోపం తగ్గలేదు’

|
Google Oneindia TeluguNews

చెన్నై: తను ప్రేమించిన యువతిని హత్య చేయడం పట్ల కొంత పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసులో నిందితుడు పి రామ్ కుమార్. అయితే, తనను ఆమె అవమానించి ఉండకూడదని, ఆ కోపంతోనే ఈ దారుణానికి ఒడిగట్టాల్సిన వచ్చిందని రామ్ కుమార్ కొంత ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి.

స్వాతి హత్య: గొంతుకోసింది పోలీసులేనని రామ్‌కుమార్ తండ్రి సంచలనం

ఓ జైలు అధికారి తెలిపిన వివరాల ప్రకారమంటూ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం ప్రకారం.. 'రామ్‌కుమార్ ఇతర నిందితులకు దూరంగా ఉంటున్నాడు. 'నేను(రామ్‌కుమార్) ఆమె(స్వాతిని)ను చంపాల్సింది కాదు' అని కొందరు ఖైదీలకు రామ్‌కుమార్ తెలిపాడు. ఆమె నుంచి కఠినమైన పదాలు, దూషణలు రావడంతో తనను తాను అదుపుచేసుకోలేకపోయినట్లు ఆ ఖైదీలకు తెలిపాడు. తాను ఎంత ప్రయత్నించి ఆమె తనను దూషించిందని చెప్పాడు' అని వివరించారు.

ప్రస్తుతం జైలులోని ఆస్పత్రి బ్లాక్-2లో మరో 45మందితో కలిసి రామ్ కుమార్ చికిత్స పొందుతున్నాడు. 'రామ్‌కుమార్ మరో ఇద్దరు ఖైదీలతో ఒకే రూంలో ఉంటున్నాడు. ప్రతీ రోజూ పొద్దున, సాయంత్రం అతడ్ని వైద్యులు పరీక్షిస్తున్నారు. ఇతర ఖైదీలతో అతడు మాట్లాడుతున్నాడు. కానీ, ఓ బృందం అతనిపై కన్నేసి ఉంచింది' అని ఆ అధికారి తెలిపినట్లు తన కథనంలో పేర్కొంది.

swathi

స్వాతి హత్య అనంతరం నిందితుడి కోసం వెళ్లిన సమయంలో గొంతుకోసుకోవడంతో అతడ్ని పోలీసులు ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. తిరునల్వేలి ఆస్పత్రిలో మొదట చికిత్స అందించిన పోలీసులు.. ఆ తర్వాత చెన్నైకి తరలించారు.

స్వాతి పిలిస్తేనే చెన్నైకి వచ్చా: వైరల్‌గా రామ్‌కుమార్-స్వాతిల ఫొటో?

'ప్రస్తుతం నిందితుడు కోలుకుంటున్నాడు. ఇప్పుడిప్పుడే సాధారణంగా మాట్లాడగలుగుతున్నాడు. సాధారణ ఆహారాన్ని తీసుకుంటున్నాడు' అని మరో జైలు అధికారి తెలిపినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో పేర్కొంది.
ప్రస్తుతం నిందితుడిని ఆస్పత్రిలో ఉంచాల్సిన అవసరం లేకపోయినప్పటికీ.. అతడ్ని ఇతర నేరస్తులతో ఉంచడం లేదని తెలిపారు. సంచలనమైన హత్య కావడంతో నిందితుడిపై ఇతర నేరస్తులు దాడికి పాల్పడే అవకాశం ఉందని చెప్పారు. అలాంటి ఘటనలు తాము ఆశించడం లేదని తెలిపారు.

English summary
P Ramkumar, 24, who is in Puzhal jail for hacking to death software engineer S Swathi on June 24, regrets his action but continues to believe that she should not have insulted him, say jail sources.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X