కేంద్ర మంత్రిపై ఇంక్ చల్లి పరార్: నిరసన, ఆసుపత్రిలో రోగి, ప్రజా ప్రభుత్వంపై దాడి!
పాట్నా: డెంగ్యూ వ్యాదితో చికిత్స పొందుతున్న వ్యక్తిని పరామర్శించడానికి వెళ్లిన కేంద్ర మంత్రి మీద ఇంక్ (సిరా) చల్లి నిరసన వ్యక్తం చేసిన ఘటన బీహార్ లోని పాట్నా మెడికల్ కాలేజ్ ఆవరణంలో జరిగింది. కేంద్ర మంత్రి అశ్విన్ కుమార్ చౌబే కోటు, ఆయన కారు మీద గుర్తు తెలియని వ్యక్తి ఇంక్ పోసి నిరసన వ్యక్తం చేసి అక్కడి నుంచి చాకచక్యంగా పరారైనాడు.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి అశ్విన్ కుమార్ చౌబే మంగళవారం పాట్నాలోని పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ ఆసుపత్రి చేరుకున్నారు. ఆసుపత్రిలో డెంగ్యూ వ్యాదితో భాదపడుతున్న వారిని కేంద్ర మంత్రి అశ్విన్ కుమార్ చౌబే పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం కేంద్ర మంత్రి అశ్విన్ కుమార్ చౌబే మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఓ గుర్తె తెలియని వ్యక్తి ఒక్కసారిగా ఆయన మీద ఇంక్ తో దాడి చేశాడు. గురి తప్పడంతో ఇంక్ కేంద్ర మంత్రి ముఖం మీద కాకుండా ఆయన కోట్ మీద, పక్కనే ఉన్న కారు మీద పడింది.
ఇంక్ తో దాడి చేసిన వ్యక్తి అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకుని పరారైనాడు. ఇంక్ దాడి అనంతరం కేంద్ర మంత్రి అశ్విన్ కుమార్ చౌబే మీడియాతో మాట్లాడుతూ మానసిక పరిస్థితి సరిగా లేని వ్యక్తి ప్రజా ప్రభుత్వం నాలుగో స్థంభం మీద దాడి చేసినట్లు ఉందని ఆరోపించారు.
బీహార్ లో వరదల కారణంగా కొంత కాలం నుంచి విపరీతంగా డెంగ్యూ వ్యాదితో చాల మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బీహార్ లో వరదలు వచ్చిన తరువాత ఇప్పటి వరకూ సుమారు 900 మందికి పైగా డెంగ్యూ వ్యాదితో చికిత్స పొందుతున్నారని వైద్యులు అంటున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications