Delhi Violence:ప్రేమికుల రోజు పెళ్లి, కత్తిపోట్లకు పెళ్లి కొడుకు బలి, నవ వధువు ఆర్తనాదాలు !

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో హింసాకాండను అదుపు చెయ్యడానికి పోలీసులు విఫలయత్నం చేస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఢిల్లీలో జరుగుతున్న హింసాకాండలో ఇప్పటి వరకు 34 మంది మరణించి 250 మందికిపైగా గాయపడ్డారు. ఢిల్లీలో జరుగుతున్న ఘర్షణల్లో 13 రోజుల క్రితం ప్రేమికుల రోజు వివాహం అయిన భర్తను పొగొట్టుకున్న నవ వధువు ఆర్తనాదాలు చేస్తున్నది. ఢిల్లీలో జరిగిన హింసాకాండలో మరణించిన వారికి సంబంధించి ఏదో ఒక వార్త పలువురుని షాక్ కు గురి చేస్తున్నది. 13 రోజుల క్రితం వివాహం అయిన నవ వధువు ఎలా విలపిస్తుందో అనే సమాచారన్ని ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ వార్తా పత్రిక వివరాలు వెల్లడించింది.

పిబ్రవరి 14 వ్యాలెంటైన్స్ డే రోజు పెళ్లి

పిబ్రవరి 14 వ్యాలెంటైన్స్ డే రోజు పెళ్లి

ఫిబ్రవరి 14వ తేది వ్యాలెంటైన్స్ డే (ప్రేమికుల రోజు) ఢిల్లీలోని ముస్తఫాబాద్ లో నివాసం ఉంటున్న ఆశిక్ హుసేన్, తస్లిమాల వివాహం జరిగింది. పెళ్లి చేసుకున్న ఆశిక్ హుసేన్, తస్లిమా దంపతులు 10 రోజులు సంతోషంగా ఉన్నారు. ఈనెల 24వ తేదీన ఉదయం ఆశిక్ హుసేన్ ఇంటి నుంచి పనికి వెళ్లాడు.

భార్యను చూడాలనే ఆశతో !

భార్యను చూడాలనే ఆశతో !

ఫిబ్రవరి 24వ తేదీ సాయంత్రం ఢిల్లీ ఈశాన్య ప్రాంతాల్లో గొడవలు ఎక్కువ కావడంతో భయంతో ఆశిక్ హుసేన్ పని మద్యలో నిలిపివేసి ఇంటికి బయలుదేరాడు. తాను త్వరగా ఇంటికి వస్తానని, ఆందోళనచెందరాదని భార్య తస్లిమాకు ఆశిక్ హుసేన్ సమాచారం ఇచ్చాడు. ఇంటికి వెలుతున్న సమయంలో మార్గం మద్యలో ఆశిక్ హుసేన్ మీద గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడులు చేశారు.

మృత్యువుతో పోరాటం చేసి !

మృత్యువుతో పోరాటం చేసి !

గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడులు చెయ్యడంతో ఆశిక్ హుసేన్ శరీరం మీద అనేక చోట్ల గాయాలైనాయి. తీవ్రగాయాలైన ఆశిక్ హుసేన్ ను ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీలోని ఆల్ హింద్ ఆసుపత్రికిలో మృత్యువుతో పోరాటం చేసిన ఆశిక్ హుసేన్ చికిత్స విఫలమై బుధవారం రాత్రి ప్రాణాలు విడిచాడు.

ఆర్తనాదాలు చేస్తున్న నవ వధువు

ఆర్తనాదాలు చేస్తున్న నవ వధువు

పనికి వెళ్లిన భర్త ఆశిక్ హుసేన్ ఇంటికి తిరిగి వస్తాడని ఎంతో ఆశగా ఎదురు చూసిన తస్లిమా షాక్ కు గురైయ్యింది. పెళ్లి జరిగి 13 రోజులు పూర్తి కాకముందే భర్త ఆశిక్ హుసేన్ ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో తస్లిమా ఆర్తనాదాలు చేస్తున్నది. జీవితాంతం తనకు తోడుగా, అన్ని విదాలుగా అండగా ఉంటానని పెళ్లి చేసుకున్న భర్త ఆశిక్ హుసేన్ శాశ్వతంగా దూరంగా కావడంతో ఆవేదన చెందుతున్న తస్లిమాను ఓదార్చడం ఎవ్వరివల్ల సాధ్యం కావడం లేదని ఆమె కుటుంబ సభ్యులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+