‘ప్రజలు ఇది కోరుకోవడం లేదు’: సల్మాన్ ఖాన్ మాట
ముంబై: ‘భారతదేశంలో అసహనం'పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తర్వాత మరో ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నోరు విప్పారు. కళా, వినోదాన్ని రాజకీయాలతో ముడిపెట్టరాదని సల్మాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు.
పాకిస్థాన్ గజల్ గాయకుడు గులాం అలీ ముంబై, పుణెల్లో నిర్వహించతలపెట్టిన సంగీత కచేరీని శివసేన అడ్డుకున్న విషయంపై ప్రశ్నించగా సల్మాన్ ఖాన్ పై విధంగా స్పందించారు. ‘ప్రజలు ఇది కోరుకోవడం లేదు' అని అన్నారు. కళా, వినోదానికి ఎల్లలు లేవని ఆయన చెప్పారు.
‘ప్రస్తుతం అన్నీ డిజిటలైజ్ చేయబడ్డాయి. భారతీయులు ప్రతీ వినోదాన్ని చూస్తారు. అది పాకిస్థాన్ నుంచి వచ్చినదైనా సరే. అందువల్ల కళా, వినోదానికి ఎల్లలు లేవు. వినోదాన్ని ప్రతీ సామాన్యుడు కోరుకుంటాడు' అని సల్మాన్ చెప్పారు.

పాకిస్థాన్‌కు చాలా మంది కళాకారులు భారతదేశంలో పని చేస్తుండటంపై సల్మాన్ స్పందిస్తూ..‘భారత చలన చిత్రంలో పాకిస్థాన్‌కు చెందిన కళాకారులు అవసరం అనుకుంటే.. వారిని తీసుకోవచ్చు. దానికి ఎవరూ అడ్డుచెప్పబోరు. బాలీవుడ్‌కు పాకిస్థాన్‌లో భారీస్థాయిలో అభిమానులున్నారు. అందువల్ల మంచి ఆదాయం కూడా పొరుగుదేశం నుంచి వస్తోంది' అని సల్మాన్ వివరించారు.
షారుక్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మరుసటే రోజే సల్మాన్ స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారతదేశంలో అసహనం పెరుగుతోందని ఆరోపిస్తూ పలువురు సినీ కళారంగాలకు చెందిన ప్రముఖులు వారికి అవార్డులు వెనక్కి ఇవ్వడాన్ని షారుక్ సమర్థించారు. అంతేగాక, భారతదేశంలో అసహనం కాదు, తీవ్ర అసహనం ఉందని చెప్పారు.
-
నటి డ్రెస్ జిప్ తీసేసిన హీరో: డైరెక్టర్ కట్ చెప్పినా ఆగని రొమాన్స్! -
హిందీ స్టార్ హీరోల వేధింపుల వల్లే డైరెక్టర్లకు కష్టాలు.. -
బన్నీ మూవీలో ఐదుగురు భామలా? అట్లీ స్కెచ్ మామూలుగా లేదుగా! -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
‘ధురంధర్2’ చూశారా? ప్రేక్షకుల్లో సృష్టించిన విద్వేషపూరిత చీలిక అర్థమైందా? -
సొంత భర్త సినిమాకు దీపిక ఆబ్సెంట్.. ఏం జరుగుతోంది..? -
ఐ లవ్డ్ ధురంధర్ 1.. బట్ - జక్కన్న సెన్సేషన్ రివ్యూ: అలాంటి హీరోలందరినీ చంపేసింది -
"ధురంధర్ 2 సినిమాను బ్యాన్ చేయాలి" -
రణవీర్ సింగ్‌ను చెంపదెబ్బ కొట్టిన ప్రముఖ నటి! వీడియో -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే! -
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
సొంత సినిమాను వదిలేసి పరాయి సినిమాకు భజనా?












Click it and Unblock the Notifications