విశాఖ మునిగిపోతుందట-ముంబై, చెన్నై, కొచ్చీ కూడా-ఐపీసీసీ తాజా రిపోర్ట్
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వాతావరణ మార్పుల ప్రభావం వివిధ దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న నగరాలపై వీటి ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఇందుకు తాజా ఉదాహరణ అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్ధ నాసాకు చెందిన అంతర్ ప్రభుత్వాల ప్యానెల్ ఇచ్చిన తాజా రిపోర్ట్. ఇందులో భారత్ లోని 12 తీర ప్రాంత నగరాలు వాతావరణ మార్పుల కారణంగా ఈ శతాబ్ధం అంతమయ్యే లోపు 3 అడుగుల మేర సముద్రంలో మునిగిపోతాయని తేలింది.
Recommended Video

వాతావరణ మార్పుల ప్రభావం
ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి పేరుతో జరుగుతున్న వినాశనం కారణంగా వాతావరణంలో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అంతకంతకూ పెరుగుతున్న కర్బన ఉద్గారాల కారణంగా వాతావరణ తీవ్ర మార్పులకు లోనవుతోంది. దీని ప్రభావం ఇప్పటికే కనిపిస్తుండగా.. భవిష్యత్తులో మరింత దారుణంగా పరిస్ధితులు మారబోతున్నట్లు తాజా నివేదికలు చెప్తున్నాయి. తాజాగా వాతావరణ మార్పులపై అధ్యయనం చేసి నాసాకు చెందిన అంతర్ ప్రభుత్వాల ప్యానెల్ రూపొందించిన నివేదిక భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల గుండెల్లో గుబులు రేపేలా ఉంది.

పెరుగుతున్న సముద్ర మట్టాలు
ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పుల కారణంగా సముద్ర పట్టాలు వేగంగా పెరుగుతున్నాయి. అసలే ప్రపంచంలో 71 శాతంగా ఉన్న జల వనరులు, 29 శాతం భూమి ఉండగా.. ఇప్పుడు అందులో సముద్రాల మట్టం పెరగడం అందరినీ కలవరపెడుతోంది. వాతావరణ మార్పులతో భూవాతావరణం వేడెక్కి హిమనీ నదాలు కరిగిపోవడం ఇందుకు కారణమవుతోంది. వీటి ప్రభావం రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతోందో తాజాగా నాసా వెల్లడించిన ఐపీసీసీ నివేదిక చెబుతోంది. భారత్ వంటి దేశాలపై ఈ మార్పులు తీవ్ర ప్రభావం చూపుబోతున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది.

సముద్రంలోకి జారుతున్న నగరాలు
వాతావరణ మార్పుల కారణంగా తీర ప్రాంతాలకు ఆనుకుని అభివృద్ధి చెందుతున్న నగరాలు భవిష్యత్తులో పెరిగే నీటి మట్టాలతో తీవ్ర మార్పులకు లోనవడం ఖాయమని నాసా ఐపీసీసీ నివేదిక హెచ్చరిస్తోంది. సముద్ర మట్టాలు పెరగడం వల్ల ఈ నగరాలు ముంపుకు గురయ్యే ప్రమాదం అంతకంతకూ పెరుగుతోందని తాజా అధ్యయనం తెలిపింది. సముద్ర మట్టాల పెరుగుదల వల్ల మానవ జీవితాలు కూడా తీవ్రంగా ప్రభావితం అయ్యే ప్రమాదం పొంచి ఉందని ఈ నివేదిక హెచ్చరించింది. ఇప్పటి నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో పెనుముప్పు తప్పదనేలా ఈ నివేదిక హెచ్చరికలు జారీ చేసింది.

విశాఖతో పాటు 12 భారతీయ నగరాలకు ముప్పు
ఈ శతాబ్దం అంతమయ్యే నాటికి ఏపీలోని విశాఖపట్నం సహా 12 భారతీయ నగరాలు 3 అడుగుల మేర సముద్రంలో మునిగిపోయే ప్రమాదం ఉందని నాసాకు చెందిన ఐపీసీసీ రిపోర్ట్ హెచ్చరించింది. ఇవన్నీ తీర ప్రాంత నగరాలే. ఇందులో ముంబై, చెన్నై, కొచ్చి, కాండ్లా, ఓఖా, భావ్ నగర్, మంగళూర్, మార్మగోవా, పారాదీప్, ఖిధిర్ పూర్, ట్యుటికోరిన్ ఈ జాబితాలో ఉన్నాయి.
2006 నుంచి 2018 మధ్య సాగిన ఓ అధ్యయనం ప్రకారం అంతర్జాతీయంగా సముద్ర మట్టాలు ఏడాదికి 3.7 మిల్లీ మీటర్ల చొప్పున పెరుగుతున్నాయి. ఆసియాలో అయితే ఈ పెరుగుదల మరింత ఎక్కువగా ఉందని ఐపీసీసీ చెబుతోంది. దీని వల్ల భారత్ వంటి దేశాల్లో తీర ప్రాంత నగరాలకు ముంపు పొంచి ఉన్నట్లు చెబుతోంది.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications