IPL 2023: ఆర్సీబీకి గుడ్ న్యూస్-లక్నోతో పోరుకు ఆ స్టార్ పేసర్ రెడీ.. !
ఐపీఎల్ 2023లో ఆడిన 8 మ్యాచ్ ల్లో నాలుగు మ్యాచ్ లు గెలిచి మరో నాలుగింటిలో ఓడిన రాయల్ ఛాలెంజర్స్ కు కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా దూరం కావడం సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో లక్నోతో తర్వాతి లీగ్ మ్యాచ్ కు సిద్ధమవుతున్న ఆర్సీబీకి గుడ్ న్యూస్ అందింది. ఈ ఏడాది ఓ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా గాయపడి ఆర్సీబీ తరఫున ఈ సీజన్ లో ఇప్పటివరకూ ఆడలేకపోయిన ఓ స్టార్ పేసర్ ఇప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
ఐపీఎల్ సీజన్లో భాగంగా సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగే మ్యాచ్ లో ఆస్ట్రేలియన్ స్టార్ పేసర్ జోష్ హేజిల్ వుడ్ ఆర్సీబీలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. హేజిల్ వుడ్ రాకతో బెంగళూరు పేస్ దాడి రాటుతేలబోతోంది. ఇప్పటివరకూ బ్యాట్స్ మెన్ రాణిస్తున్నా బౌలర్ల నుంచి తగినంత సహకారం లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆర్సీబీకి ఇప్పుడు జోష్ హేజిల్ వుడ్ రాక ప్రయోజనం చేకూర్చబోతోంది.

వాస్తవానికి ఈ ఏడాది సిడ్నీలో జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్ వుడ్.. భారత్ లో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ఎంపికయ్యాడు. భారత్ కు వచ్చినా గాయం కారణంగా తిరిగి చికిత్స తీసుకునేందుకు స్వదేశం వెళ్లిపోయాడు. ఇప్పుడు కోలుకోవడంతో తిరిగి ఐపీఎల్ లో రీఎంట్రీ ఇచ్చేందుకు హేజిల్ వుడ్ సిద్ధమవుతున్నాడు. అలాగే హేజిల్ వుడ్ రాక కోసం ఆర్సీబీ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మేనేజ్ మెంట్ వర్గాలు వెల్లడించాయి.
కొంతకాలంగా హేజిల్ వుడ్ గాయాన్ని నిశితంగా పరిశీలిస్తున్న క్రికెట్ ఆస్ట్రేలియా.. ఇప్పుడు ఆర్సీబీ లక్నోతో ఆడే మ్యాచ్ కు ముందు తాజా పరిస్దితిపై నివేదిక తెప్పించుకోనుంది. దీని ఆధారంగా ఫైనల్ క్లియరెన్స్ ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ తన రన్నింగ్ లోడ్ ను క్రమంగా పెంచుకోమని క్రికెట్ ఆస్ట్రేలియా జోష్ హేజిల్ వుడ్ కు సలహా ఇచ్చినట్లు సమాచారం. దీంతో లక్నోతో మ్యాచ్ లో జోష్..పూర్తిస్ధాయి బౌలింగ్ చేస్తాడో లేదా అన్న ఉత్కంఠ నెలకొంది.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications