IPL 2023 : ధోనీ చేతుల్లో నా తమ్ముడు సేఫ్- యువ బౌలర్ సోదరి ఎమోషనల్ కామెంట్స్..
గతంలో భారత జట్టు కెప్టెన్ గా, కొన్నేళ్లుగా చెన్నె సూపర్ కింగ్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీని యువ క్రికెటర్లను ప్రోత్సహిస్తాడనే పేరుంది. తన జట్టులో యువ క్రికెటర్లను ప్రోత్సహించే విషయంలో ఎప్పుడూ ముందుండే ధోనీ.. వారికి అన్ని విషయాల్లో అండగా నిలుస్తాడు. వారి ప్రతిభను వెలికి తీయడంలో కానీ, దాన్ని జట్టు అవసరాలకు తగ్గట్టుగా వాడుకోవడంలో కానీ ధోనీకి ఎంతో పేరుంది. అందుకే సదరు యువ క్రికెటర్లే కాదు వారి కుటుంబాలు కూడా ధోనీని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాయి. ఇలాంటిదే ఓ ఘటన తాజాగా చోటు చేసుకుంది.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫైనల్ కు చేరడంలో కీలక పాత్ర పోషించిన డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్, యువ బౌలర్ మతీష పతిరణ పేరు ఇప్పుడు సర్వత్రా మార్మోగుతోంది. శ్రీలంకకు చెందిన ఈ యువ బౌలర్ వెటరన్ బౌలర్ మలింగ తరహాలోనే బౌలింగ్ చేస్తూ అభిమానుల్ని ఆకర్షిస్తున్నాడు. అదే సమయంలో బ్యాటర్లను చికాకు పెడుతున్నాడు. చివరికి ఈ స్పెషల్ బౌలింగ్ అర్ధం చేసుకోలేక బ్యాటర్లు వికెట్లు సమర్పించుకుంటున్నారు. దీంతో కెప్టెన్ ధోనీకి మతీష ఇప్పుడు వెరీ స్పెషల్ గా మారిపోయాడు.
చెన్నె సూపర్ కింగ్స్ తరఫున విశేషంగా రాణిస్తున్న మతీష పతిరణ ఇప్పటివరకూ 11 మ్యాచ్ లు అడి 17 వికెట్లు తీశాడు.

ఇప్పుడు ఐపీఎల్ ఫైనల్ కు సిద్దమవుతున్న మతీష పతిరణ కుటుంబాన్ని చెన్నె కెప్టెన్ మతీష పతిరణ తాజాగా కలిశాడు. వారి ఇంటికి వెళ్లి మరీ మతీష, ఆయన సోదరి విషుక పతిరణను సైతం కలిశాడు. దీంతో వారిద్దరూ సంతోషంలో మునిగిపోయారు. ధోనీ కాసేపు వారితో గడిపి ఆ తర్వాత వెళ్లిపోయాడు. ఈ సందర్భంగా మతీష సోదరితో కాసేపు మాట్లాడిన ధోనీ.. ఆమె సోదరుడి గురించి ఓ కీలక హామీ కూడా ఇచ్చాడు. దీన్ని ఆమె ఇన్ స్టా గ్రామ్ లో ఫొటోలతో పాటు పంచుకుంది.

విషుక తాను ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫొటోలతో పాటు కింద క్యాప్షన్ గా.."మతీషా గురించి మీరు చింతించాల్సిన పనిలేదు, అతను ఎప్పుడూ నాతోనే ఉంటాడు" అని థాలా(ధోనీ) చెప్పినప్పుడు మల్లి(మతీష) సురక్షితంగా ఉన్నారని మేము ఇప్పుడు ఖచ్చితంగా అనుకుంటున్నాము. ఈ క్షణాలు నేను కలలుగన్న దానికంటే మించినవి. అంటూ చెప్పుకొచ్చింది. తద్వారా తన సోదరుడి భవిష్యత్తు గురించి ఇక తమకు ఎలాంటి బెంగా అక్కర్లేదని చెప్పకనే చెప్పింది.












Click it and Unblock the Notifications