కుంభమేళాకు వెళ్తున్నారా ? మీ కోసం IRCTC టెంట్ సిటీ రెడీ..! బుకింగ్స్ ఇలా..

ఈ ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ వేదికగా జరిగే మహా కుంభమేళాకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కుంభమేళా ప్రారంభం కానుంది. దీనికి దేశ విదేశాల నుంచి భారీ ఎత్తున భక్తులు హాజరు కాబోతున్నారు. వీరి కోసం భారతీయ రైల్వేకు చెందిన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) కూడా తమ వంతుగా సౌకర్యాలు కల్పిస్తోంది.

irctc offers all in one tent city mahakumbh gram for devotees- here is complete details

ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ్ గ్రామ్ పేరిట ఏర్పాటు చేసిన టెంట్ సిటీలో భక్తులకు ఐఆర్సీటీసీ స్వాగతం పలుకుతోంది.
త్రివేణి సంగమం నుండి కేవలం 3.5 కిలోమీటర్ల దూరంలో నిర్మించిన కుంభ్ గ్రామ్ స్నాన ఘాట్‌లు, ఇతర సౌకర్యాలతో ఆకట్టుకుంటోంది. కుంభ్ గ్రామ్ పర్యాటకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన అత్యాధునిక వసతి సౌకర్యం. ఇక్కడ అన్ని ఆధునిక సౌకర్యాలను అందుబాటులో ఉంచారు. త్రివేణి ఘాట్‌కు టెన్త్ సిటీ సమీపంలో ఉండటం స్నానాలు చేయాలనుకునే వారికి కూడా ప్రయోజనంగా ఉంది.

irctc offers all in one tent city mahakumbh gram for devotees- here is complete details

ఈ కుంభ్ గ్రామ్ లో సూపర్ డీలక్స్ టెంట్లు, విల్లా టెంట్లు, బాత్రూమ్‌లు, వేడి, చల్లని నీటి సౌకర్యాలు, రోజంతా హాస్పిటాలిటీ , బెడ్‌లినెన్, టవల్‌లు, టాయిలెట్‌లు ఆకర్షణీయమైన ధరల్లో IRCTC అందుబాటులోకి తెచ్చింది. సీసీ టీవీలతో భక్తులకు ఇక్కడ భద్రత కల్పిస్తున్నారు. అలాగే భోజనాలతో పాటు మహా కుంభ్ గ్రామ్‌లో ప్రథమ చికిత్స సౌకర్యాలు, ఎమర్జెన్సీ సౌకర్యాలను కూడా అందుబాటులో ఉంచారు. ఇందులో బుకింగ్స్ కోసం IRCTC కస్టమర్ సపోర్ట్ టీమ్‌ని 8076025236లో సంప్రదించాలి, లేదా [email protected]కి ఇమెయిల్ చేయాలని కోరుతున్నారు.

irctc offers all in one tent city mahakumbh gram for devotees- here is complete details

IRCTC మహాకుంభ్ టెంట్ సిటీ 2025ని ఎలా బుక్ చేయాలి?

IRCTC ఇప్పటికే తన వెబ్‌సైట్ www.irctctourism.com/mahakumbhgramలో కుంభ్ గ్రామ్ టెంట్ సిటీ బుకింగ్స్ ప్రారంభించింది. అధికారిక IRCTC వెబ్‌సైట్‌లోకి వెళ్లాక మీ అకౌంట్ లో లాగిన్ కావాలి. ఖాతా లేకుంటే మాత్రం మీ ఇమెయిల్ అడ్రస్, ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేసి గెస్ట్ లాగిన్ కూడా కావచ్చు. తర్వాత బుక్ నౌ క్లిక్ చేస్తే మహాకుంభ్ గ్రామ్ పేజీ హోమ్‌పేజీ కనిపిస్తుంది. బుకింగ్ ఫారంలోకి వెళ్లడానికి బుక్ నౌ బటన్‌ను క్లిక్ చేయాలి. వసతి వివరాలను ఎంటర్ చేయాలి. తర్వాత ఎలాంటి టెంట్ కావాలో ఎంపిక చేసుకోవాలి. మీ ప్రాధాన్యత, బడ్జెట్ ఆధారంగా సూపర్ డీలక్స్ , విల్లా టెంట్లు అందుబాటులో ఉంటాయి. తర్వాత వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేసి పేమెంట్ చేస్తే బుకింగ్ పూర్తవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+