నిత్యానంద మృతి చెందాడంటూ సోషల్ మీడియాలో పుకార్లు..!
నిత్యానంద స్వామి గురించి తెలియని వారుండరు. ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న ఈ స్వయంప్రకటిత ఆధ్యాత్మిక గురువు మరణించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై నిత్యానంద అధికారిక వెబ్ సైట్ నుంచి గానీ, బంధువుల నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
నిత్యానంద తమిళనాడులోని తిరువన్నామలైలో జన్మించారు. అక్కడి నుంచి కర్ణాటకలోని బీదర్ కు మకాం మార్చారు. భారత్ నుంచి పారిపోయిన తర్వాత నిత్యానంద తానొక దేశాన్ని సృష్టించానని ప్రకటించారు. దానికి కైలాస అని పేరు పెట్టారు. నిత్యానంద 2019లో "యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస" అనే దేశాన్ని స్థాపించినట్లు ప్రకటించారు. అయితే, ఈ దేశం ఎక్కడ ఉందనే దానిపై స్పష్టత లేదు.

కొందరు ఈక్వెడార్ సమీపంలోని ఒక ద్వీపమని, మరికొందరు ఇది పూర్తిగా కల్పితమని అంటారు. ఏ దేశం గానీ, అంతర్జాతీయ సంస్థ గానీ కైలాసను గుర్తించలేదు. అయితే 2023లో నిత్యానంద కైలాస ప్రతినిధులను ఐక్యరాజ్య సమితి సమావేశానికి పంపారు. అక్కడ వారు అతనిపై హిందూ వ్యతిరేక శక్తులు వేధిస్తున్నాయని ఆరోపించారు. అయితే, ఈ సమావేశాలు పబ్లిక్ ఈవెంట్‌లు కావడంతో ఎవరైనా హాజరు కావచ్చని, ఇది కైలాసకు అధికారిక గుర్తింపు కాదని ఐక్యరాజ్యసమితి అధికారులు స్పష్టం చేశారు.
ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంలో వార్తల్లోకి ఎక్కుతూ ఉంటారు. పుట్టుక నుంచి ఇప్పటివరకూ ఆయన ప్రతి అడుగూ వివాదాస్పదమే. భారత్ లో ఎన్నో ఘనకార్యాలు చేసిన నిత్యానంద.. దేశం విడిచి పారిపోయారు. కైలాస దేశాన్ని సృష్టించానని చెప్పుకుంటున్నారు.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications