Reddy: వైఎస్ జగన్ ను ఫాలో అవుతున్న గాలి జనార్దన్ రెడ్డి ?, సేమ్ సీన్ రిపీట్, ఆరోజు వైఎస్ ఫ్యామిలీ, ఇప్పుడు !
బెంగళూరు/బళ్లారి: మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి స్కెచ్ కు కర్ణాటకలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీలు బిత్తరపోతున్నాయి. అక్రమ మైనింగ్ కేసులో జైలుకు వెళ్లిన గాలి జనార్దన్ రెడ్డి తరువాత సుప్రీం కోర్టులో షరతులతో బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు. బళ్లారి జిల్లాలో అడుగుపెట్టకూడదని సుప్రీం కోర్టు గాలి జనార్దన్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. బెంగళూరుతో పాటు సిందనూరులో నివాసం ఉంటున్న గాలి జనార్దన్ రెడ్డి ఇటీవల బీజేపీకి గుడ్ బై చెప్పి కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించారు. గాలి జనార్దన్ రెడ్డి సొంత జిల్లా బళ్లారిలో ఆయన పార్టీ తరపున ప్రచారం చెయ్యడానికి అవకాశం లేదు. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులను రంగంలోకి దింపి ఎలాంటి స్కెచ్ వేసి ఆయన అనుకున్నది సాధించారో ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి కూడా సేమ్ అలాంటి స్కెచ్ వేసి ఆయన అనుకున్న పని పూర్తి చెయ్యాలని డిసైడ్ కావడం హాట్ టాపిక్ అయ్యింది.

బీజేపీకి రామ్ రామ్
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో ఎలా చక్రం తిప్పారో రాజకీయాలు తెలిసిన వాళ్లకు కొత్తగా చెప్పనవసరం లేదు. బీజేపీ నాయకులు నన్ను పట్టించుకోలేదని, నా అవసరం తీరిపోయిన తరువాత నా రాజకీయ జీవితం గురించి ఏమాత్రం ఆలోచించలేదని ఆరోపించిన గాలి జనార్దన్ రెడ్డి బీజేపీకి రామ్ రామ్ పాడేశారు. గాలి జనార్దన్ రెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పడంతో ఆ పార్టీలోకి కొందరు నాయకులు హడలిపోయారు.

కొత్త పార్టీతో ఝలక్ ఇచ్చిన రెడ్డి
గాలి జనార్దన్ రెడ్డి కల్యాణ రాజ్య ప్రగతి అనే కొత్త రాజకీయ పార్టీ పెట్టడంతో ఆయన అభిమానులు, అనుచరుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. బళ్లారి, బెంగళూరుతో పాటు కర్ణాటకలో సుమారు 10 జిల్లాల్లో గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు లక్షల సంఖ్యలో ఉన్నారు. గాలి జనార్దన్ రెడ్డి కొత్త రాజకీయ పార్టీతో బీజేపీతో పాటు కాంగ్రెస్, జేడీఎస్ కు కొన్ని జిల్లాల్లో దెబ్బపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బళ్లారిలోకి నో ఎంట్రీ
సుప్రీం కోర్టు ఆదేశాలతో గాలి జనార్దన్ రెడ్డి ప్రస్తుతం బళ్లారి జిల్లాలో అడుగుపెట్టడానికి అవకాశం లేకుండా పోయింది. గాలి జనార్దన్ రెడ్డి రాజకీయ రంగప్రవేశం తరువాత బళ్లారి జిల్లా రాజకీయ రూపురేఖలనే మార్చేశారు. అంతకాలం బళ్లారి జిల్లాలను శాసించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తెరమరుగు అయిపోయారు. బళ్లారి జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలోని తన అనుచరులను గాలి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలిపించుకుని తన సత్తా చాటుకున్నారు. అలాంటి గాలి జనార్దన్ రెడ్డి ప్రస్తుత పరిస్థితుల్లో బళ్లారి జిల్లాలో ఆయన కొత్త పార్టీ కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ తరపున ప్రచారాలు చెయ్యడం, సమావేశాలు నిర్వహించడానికి అవకాశం లేదు.

ఆ రోజు వైఎస్ జగన్.... ఈరోజు గాలి ఫ్యామిలీ.... సేమ్ సీన్ రిపీట్
గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేపట్టారు. అప్పట్లో అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన మోహన్ రెడ్డి జైలుకు వెళ్లారు. తరువాత వైఎస్ జగన్ తల్లి విజయమ్మ, జగన్ సోదరి షర్మిల రంగంలోకి దిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేశారు. వైఎస్ షర్మిల వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసి వైఎస్ఆర్ అభిమానులకు ధైర్యం చెప్పారు. వైఎస్ జగన్ బాటలో ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి నడుస్తున్నారని తెలిసింది.

రంగంలోకి దిగిన రెడ్డి ఫ్యామిలీ
గాలి జనార్దన్ రెడ్డి సతీమణి గాలి లక్ష్మీ అరుణ ఇంత వరకు పబ్లిక్ మీటింగ్ ల్లో, రాజకీయ సమావేశాల్లో కనపడలేదు. అలాగే గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రాహ్మిణి హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తల్లి అయ్యింది. గాలి జనార్దన్ రెడ్డి బళ్లారిలో అడుగు పెట్టడానికి అవకాశం లేకపోవడంతో ఆయన సతీమణి గాలి లక్ష్మీ అరుణ, కుమార్తె బ్రహ్మిణి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. బళ్లారిలో కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించి గాలి అభిమానుల్లో ఉత్సాహం నింపారు. ఇదే సమయంలో గాలి జనార్దన్ రెడ్డికి జరిగిన అన్యాయం గురించి వారు విచారం వ్యక్తం చేశారు.

నాతండ్రి ఏం చేశారో మీకు తెలుసు.... నేను కొత్తగా ఏం చెప్పాలి
బళ్లారిలో కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ భారీ బహిరంగ సమావేశం నిర్వహించింది. గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మిణి ఈ సమావేశంలో మాట్లాడారు. గాలి జనార్దన్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు బళ్లారి నగరం ఎలా ఉండేదో మీకు తెలుసు, ఇప్పుడు అదే బళ్లారి సిటీ ఎలా ఉందో మీకు తెలుసు, నగరంలో ఫ్లైఓవర్లు, రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సరఫరా వియషయంలో, సామాన్య ప్రజలకు అవసరమైన అన్ని సధుపాయాలు కల్పించడంలో శక్తి వంచనలేకుండా పని చేసిన నా తండ్రి ఈరోజు బళ్లారి జిల్లాలో అడుగుపెట్టడానికి అవకాశం లేకుండా పోయింది. మీ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి బళ్లారిలో అడుగు పెట్టాలంటే అది మీ చేతుల్లోనే ఉంది, ఆయన పేదల కోసం స్థాపించిన కల్యాణ రాజ్య ప్రగతి పార్టీకి మీరు పట్టం కట్టాలని గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మిణి బహిరంగ సభలో కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

కలలో కూడా ఊహించలేదు
తాను బహిరంగ సమావేశంలో మాట్లాడాతనని కలలో కూడా ఊహించలేదని గాలి జనార్దన్ రెడ్డి సతీమణి గాలి లక్ష్మీ అరుణ విచారం వ్యక్తం చేశారు. తన భర్త గాలి జనార్దన్ రెడ్డికి అన్యాయం జరిగింది. పేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు కోసం ఆయన కొత్త రాజకీయ పార్టీ పెట్టారు. త్వరలో పార్టీ ప్రణాళిక విడుదల చేస్తారు, నా భర్తను గతంలో ఆదరించినట్లే ఇప్పుడు మీరు ఆధరించాలని గాలి లక్ష్మీ అరుణ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తప్పకుండా గాలి జనార్దన్ రెడ్డి ఆయన అనుకున్న పని సాధిస్తారని, ఆయన మద్దతుదారులను గెలిపించుకుంటారని గాలి లక్ష్మీ అరుణ ధీమా వ్యక్తం చేశారు.

జగన్ ను ఫాలో అవుతున్న గాలి జనార్దన్ రెడ్డి ?
భారీ బహిరంగ సభ నిర్వహించక ముందు ముందు బళ్లారిలోని శ్రీకనదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, బళ్లారిలో కౌల్ బజార్ లోని దివాన్ మస్తాన్ దర్గాలో, ఇందిరానగర్ లోని ఆరోగ్య మేరీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన గాలి లక్ష్మీ అరుణ, బ్రహిణి బళ్లారిలో కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ తరపున ప్రచారం మొదలుపెట్టారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి ప్లాన్ వేశారో ఇంచుమించు దాదాపుగా కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి కూడా అలాంటి స్కెచ్ వెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications