ఇదేమైనా సినిమా స్క్రిప్టా?: దిలీప్ కేసులో హైకోర్టు ఆగ్రహం
కొచ్చి: మలయాళీ నటిని కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో అరెస్టైన ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ కేసులో కేరళ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసును కేరళ పోలీసులు సరిగ్గా విచారించడం లేదని, ఓ సినిమా స్క్రిప్టులా భావిస్తున్నారని హైకోర్టు న్యాయమూర్తి ఉబైద్ మండిపడ్డారు.
కిడ్నాప్ ఘటన జరిగి ఆరు నెలలు కావొస్తున్నా.. కేసు ఇంకా ఓ కొలిక్కి రాకపోవడంపై న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. దీంతో మరో రెండు వారాల్లో విచారణ ముగించేస్తామని డీజీపీ న్యాయమూర్తికి తెలిపారు.

ఈ కేసు విషయంలో దర్శకుడు, దిలీప్ సన్నిహితుడు నదీర్ షా పూర్తిగా సహకరించాలని లేకపోతే మరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. నటి కిడ్నాప్ కేసులో ఇప్పటికే దిలీప్ తోపాటు ప్రధాన నిందితులు పల్సర్ సుని, మార్టిన్, విగేష్‌లను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications