వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీవిత ఖైదు! స్వ‌లింగ సంప‌ర్కం నేర‌మా? కాదా?: గురువారమే తేల్చనున్న సుప్రీంకోర్టు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: స్వ‌లింగ సంప‌ర్కం నేర‌మా? కాదా? అనే విషయంపై గురువారం సుప్రీంకోర్టు తేల్చ‌నుంది. వివాదాస్ప‌ద 377 సెక్ష‌న్‌పై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం చ‌రిత్రాత్మ‌క తీర్పును ఇవ్వ‌నుంది. దీంతో తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 నేరమా? కాదా?

నేరమా? కాదా?

ఐపీసీలోని 377 సెక్ష‌న్ ప్ర‌కారం స్వ‌లింగ సంప‌ర్కం నేరం. కాగా, దాన్ని స‌వాల్ చేస్తూ అనేక పిటీష‌న్లు సుప్రీంలో దాఖ‌లు అయ్యాయి. సెక్ష‌న్ 377కు రాజ్యాంగ నిబ‌ద్ద‌త ఉందా? లేదా? అన్న అంశాన్ని ఐదుగురు స‌భ్యుల ధ‌ర్మాస‌నం గురువారం (సెప్టెంబ‌ర్ 6న) తేల్చ‌నుంది. స్వలింగ సంపర్కం నేరమా? కాదా? అన్న అంశంపై సుప్రీంకోర్టులో చాన్నాళ్లుగా వాదనలు కొనసాగుతున్నాయి.

స్వ‌లింగ సంప‌ర్కం నేర‌మా.. కాదా ? సెక్షన్ 377 రాజ్యంగ బద్ధతపై సుప్రీం పున: పరిశీలన!స్వ‌లింగ సంప‌ర్కం నేర‌మా.. కాదా ? సెక్షన్ 377 రాజ్యంగ బద్ధతపై సుప్రీం పున: పరిశీలన!

377రద్దు చేయాలంటూ..

377రద్దు చేయాలంటూ..

స్వలింగ సంపర్కం అంశంపై తాము ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నామని, సుప్రీంకోర్టు విచక్షణకే ఈ అంశాన్ని వదిలివేస్తున్నామని ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి కేంద్రం ఇటీవ‌ల తెలిపింది. సెక్ష‌న్‌ 377ను రద్దు చేయాలంటూ పెట్టుకున్న అభ్యర్థనలపై సుప్రీం సీనియర్ జడ్జిలు విచారణ చేపడుతున్నారు.

 అపట్నుంచే.. జీవిత ఖైదు..

అపట్నుంచే.. జీవిత ఖైదు..

బ్రిటీష్ కాలం నాటి చట్టం ప్రకారం ఒకవేళ ఎవరైనా స్వలింగ సంపర్కానికి పాల్పడితే వాళ్లకు జీవిత కాల జైలు శిక్షను విధిస్తారు. కాగా, జులైలో కేంద్ర ప్రభుత్వం తరపున న్యాయవాది తుషార్ మెహత తన అభిప్రాయాన్ని వినిపించారు.

స్వలింగ సంపర్కం కేసులో కోర్టు విచక్షణకే నిర్ణయాన్ని వదిలేస్తున్నామన్నారు.

తీర్పుపై ఉత్కంఠ

తీర్పుపై ఉత్కంఠ

ఈ క్రమంలో ఈ విషయంపై చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా స్పందించారు. 377 సెక్ష‌న్‌ ప్రకారం స్వలింగ సంపర్కం నేరమా? లేక దాన్ని నేరంగా పరిగణించరాదా? అన్న నిర్ణయాన్ని తమకే వదిలేస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో గురువారం సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

English summary
The Supreme Court will pronounce its verdict on the legality of Section 377 of the Indian Penal Code on Thursday. The court would decide whether the section that criminalised sexual relations between same gender adults would be valid or not.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X