Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Vijay:తమిళ రాజకీయాల్లో విజయ్ ఒంటరివాడైపోయాడా..?

మరో రెండు మూడు నెలల్లో తమిళనాడులో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటికే ఆయా పార్టీల మధ్య చర్చోపచర్చలు జరుగుతున్నాయి. పొత్తులపై ఎవరికి అనుకూలంగా వారు పావులు కదుపుతున్నారు. ఇక తమిళ రాజకీయ ముఖచిత్రంలో ఈ సారి నటుడు విజయ్ పార్టీపైనే ప్రధాన దృష్టి కేంద్రీకృతమైంది. సినిమాల పరంగా విజయ్‌కున్న మాస్ ఫాలోయింగ్ ఓట్ల రూపంలోకి కన్వర్ట్ కాగలదా అనేది ప్రధాన ప్రశ్న. ఇక పొత్తులపై కూడా విజయ్ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. బలంగా ఉన్న డీఎంకేను ఢీకొట్టాలంటే ఎవరితో వెళ్లాలి, లేదా ఎవరు తనతో కలిసొస్తారనేదానిపై సీరియస్‌గా ఆలోచిస్తున్నారు విజయ్. ఈ క్రమంలోనే కొన్ని ఆసక్తికరమైన పొలిటికల్ ఈక్వేషన్స్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైయ్యాయి.

విజయ్‌కు దూరంగా ఉంటున్న నేతలు...
తమిళనాట రాజకీయాలు ఈ సారి చాలా ఆసక్తికరంగా మారాయి. మరో రెండు మూడు నెలల్లో తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ప్రధాన పోటీ డీఎంకే కాంగ్రెస్ కూటమి అన్నాడీఎంకే బీజేపీ కూటమి మధ్యే అని పైకి చెబుతున్నప్పటికీ... కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసిన తమిళ సూపర్ స్టార్ విజయ్ ఇక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. అయితే ఇక్కడ విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఎవరికి నష్టం చేకూరుస్తుందనేది మరో ఆసక్తికరమైన అంశంగా ఉంది. కొద్ది రోజుల క్రితం పలువురు పేరున్న తమిళ నాయకులు లేదా ఆయా రాజకీయ పార్టీలకు చెందిన నేతలు విజయ్ పార్టీలో చేరి తనకు అండగా నిలుస్తామంటూ గట్టి వాగ్దానాలే చేశారు. అయితే కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కు సీబీఐ నుంచి పిలుపు రావడం ఆయన విచారణకు హాజరవడంతో... ఈ బడా నేతలంతా చిన్నగా తప్పుకుంటున్నారు లేదా సైలెంట్ అయిపోయారు.

is-vijay-heading-for-a-solo-battle-in-tamil-nadu-politics

విజయ్‌కు హ్యాండిచ్చిన దినకరన్
పార్టీ పెట్టిన కొత్తలో టీవీకే పార్టీ ఎవరితో పొత్తుతో వెళ్లదని సొంతంగా లేదా ఒంటరిగానే తమిళనాడు అసెంబ్లీ బరిలోకి దిగుతుందని కంఠాపథంగా విజయ్ చెప్పారు. కానీ కాలం గడుస్తున్న కొద్దీ ఆయన స్వరం కూడా మారింది. తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా బలపరిచే పార్టీలతో పొత్తు కుదుర్చుకునే తాను సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపారు. ఇక బీజేపీతో సిద్ధాంత పరమైన విబేధాలు ఉండటంతో ఆ పార్టీతో పొత్తు ఉండదని, అదే సమయంలో రాజకీయ శతృవైన డీఎంకేతో కూడా ఉండదని క్లియర్ హింట్ ఇచ్చేశాడు. ఇక మిగిలింది అన్నాడీఎంకే. కానీ అన్నాడీఎంకే బీజేపీని కాదని విజయ్‌తో జతకట్టలేదు. కాంగ్రెస్ పార్టీ విజయ్ పార్టీతో చర్చలు జరుపుతుందనే వార్తలు షికారు చేసినప్పటికీ అవి పెద్దగా కార్యరూపం దాల్చలేదు. అవి గాలివార్తలానే ఉండిపోయాయి.తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి బంధవు, సన్నిహితుడైన దినకరన్ విజయ్‌తో జతకడతారనే ప్రచారం సైతం జరిగింది.

ఎన్డీయే వైపే చిన్న పార్టీలు...
ఇక అధికారంలోకి వస్తే తనతో పొత్తు పెట్టుకున్న పార్టీలకు తగిన ప్రాధాన్యత ఇస్తానని విజయ్ స్పష్టమైన హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. విజయ్ వైపు చూసిన ఇతర పార్టీ నేతలు ఇప్పుడు ఆ వైపే చూడటం మానేశారు సరికదా... విజయ్ పేరును ఎత్తడానికి కూడా ఇష్టపడటం లేదు. విజయ్ పార్టతో పొత్తు పెట్టుకుంటారన్న ANMK అధ్యక్షుడు టీటీవీ దినకరన్..తాజాగా స్ట్రాటజీ మారుస్తూ అన్నాడీఎంకే-బీజేపీ కూటమితో పొత్తును ప్రకటించారు. అంతేకాదు కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కూడా కలవడంతో ఇక దినకరన్ సైడ్ నుంచి స్పష్టత వచ్చేసింది. ఇక డీఎండీకే, పీఎంకే పార్టీలు కూడా ఎన్డీయే గూటికి చేరుతుండటంతో విజయ్ ఆశలు అడియాశలైపోయాయి. ఈ పార్టీలు ఎన్డీయే వైపు వెళ్లడం...టీవీకే పార్టీని షాక్‌కు గురిచేశాయి. దీంతో విజయ్ ఒంటరివాడైపోయాడు. అయినా ఫర్వాలేదు ఒంటరిగానే ప్రజాక్షేత్రంలో పోరాడేందుకు సిద్ధమయ్యాడు.

ప్రత్యామ్నాయ పార్టీగా...
తమిళనాడులో అధికారం అయితే డీఎంకేది లేదా అన్నాడీఎంకే పార్టీలదే ప్రధానంగా ఉంటుంది. ఇదే సంప్రదాయంగా కొనసాగుతోంది. అయితే విజయ్ ఈ సంప్రదాయానికి చరమగీతం పాడాలని భావించి తన కొత్త పార్టీతో బరిలోకి దిగాడు. ఈ రెండు పార్టీలకు తన టీవీకే పార్టీ ప్రత్యామ్నాయ పార్టీగా తయారవ్వాలనే వ్యూహంతో పావులు కదుపుతున్నాడు. థర్డ్ ఫ్రంట్‌ లక్ష్యంగా విజయ్ దూసుకెళుతున్నట్లు కనిపిస్తోంది. అయితే తమిళనాడులో కొంతో గొప్పో పేరున్న పార్టీలు తనతో కలిసి వస్తాయని భావించిన విజయ్‌కు శృంగభంగం తప్పేలా లేదు. దీంతో ప్రస్తుతం విజయ్ ఏకాకిగా మిగిలిపోయారు. అయితే తనకున్న ఫ్యాన్ బేస్ ఓట్లు రాల్చి తనను అధికారంలోకి తీసుకొస్తాయా అనేది అనుమానమే. ఇప్పటికే కమల్ హాసన్ పార్టీ పెట్టి విఫలమయ్యాడు. రజినీకాంత్ పార్టీ పెట్టాలని భావించినప్పటికీ చివరి నిమిషంలో ఈ రాజకీయ రొచ్చ తనకు అనవసరమని భావించి తప్పుకున్నాడు. ఇక విజయ్ ఏ మేరకు సక్సెస్ అవుతాడో కాలమే సమాధానం చెబుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+