మీ ఆధార్ సేఫేనా? దుర్వినియోగమైందా? తెలుసుకోండిలా...
న్యూఢిల్లీ: ఇప్పుడు 'ఆధార్' అన్నిటీకీ.. అందరికీ ఆధారంగా మారిపోయింది. బ్యాంకులో ఖాతా తెరవాలన్నా ఆధార్ తప్పనిసరి. కొత్తగా సిమ్ తీసుకోవాలన్నా ఇది ఉండాల్సిందే. గ్యాస్ సబ్సిడీ కావాలన్నా ఆధార్ అడుగుతారు.
ప్రతిదానికీ ఆధార్ నంబర్ లింక్ చేయడం సర్వసాధారణమైపోయింది. మరి మీ ఆధార్‌ను మీరే వాడుతున్నారా? ఇంకెవరైనా మీ ఆధార్‌ను దుర్వినియోగం చేస్తున్నారా? ఈ అనుమానం రావడం కూడా సహజమే. అంతేకాదు, ఆధార్ దుర్వినియోగాన్ని సులువుగా తెలుసుకోవచ్చు కూడా.
మనకు తెలియకుండా మన ఆధార్ నెంబర్ దుర్వినియోగం అవుతుంటుంది. దీనివల్ల లేనిపోని సమస్యలు వస్తాయి. అలా జరగకుండా ఉండేందుకే ఆధార్ సంస్థ యుఐడిఏఐ వెబ్ సైట్ ద్వారా గత ఆరు నెల్లల్లో ఎక్కడెక్కడ మీ ఆధార్ నెంబర్ ఉపయోగించారో మీరే తెలుసుకోవచ్చు.

దీనికోసం మొదట గూగుల్ సెర్చ్‌లోకి వెళ్లి ఆధార్ నోటిఫికేషన్ అని వెతకాలి. అందులో మొదట వచ్చిన వాల్యూ రిజల్ట్ లింక్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత వచ్చే వెబ్ పేజీలో ఆధార్ నంబర్ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తే ఓటీపీ నంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది.
మీ ఫోన్( అదే ఫోన్ నంబర్ ఎన్‌రోల్ అయి ఉంటే)కు వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి ఆరు నెలల్లో ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు వివరాలు కావాలో ఎంపిక చేసుకుని సబ్మిట్ కొట్టాలి. తరువాతి స్క్రీన్‌లో అన్ని వివరాలతో ఒక టేబుల్ వస్తుంది.
అందులో అథెంటికేషన్ టైప్ ( ఓటీపీ లేక బయోమెట్రిక్ )తోపాటు ఆ అథెంటికేషన్ సక్సెస్ అయిందా? ఫెయిలైందా? అనే వివరాలు చూపిస్తుంది. అథెంటికేషన్ తేదీ, సమయంతోపాటు ఆ అథెంటికేషన్‌ను ఎవరు ప్రాసెస్ చేశారో ఆ వివరాలన్నీ కనిపిస్తాయి. ఇలా మీ ఆధార్ ఎవరెవరు వినియోగిస్తున్నారో చూడొచ్చు!
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications