ఇస్రో సంచలనం- ఒకేసారి 36 శాటిలైట్స్: ముహూర్తం ఫిక్స్

బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో (ISRO) మరో రికార్డును సృష్టించడానికి సన్నద్ధమైంది. కమర్షియల్ బాట పట్టిన తరువాత అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలు, కార్పొరేట్ కంపెనీలకు చెందిన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగిస్తోంది. ఈ క్రమంలో మరో ముందడుగు వేయనుంది. ఒకేసారి 36 ఉపగ్రహాలను (Satellites) అంతరిక్షంలోకి ప్రయోగించడానికి ఏర్పాట్లను పూర్తి చేసింది. అవన్నీ వన్ వెబ్ (OneWeb) ఇంటర్నెట్ సంస్థకు చెందిన ఉపగ్రహాలు.

బ్రాడ్ బ్యాండ్ (Broad Band) సేవలను మరింత మెరుగుపర్చడానికి జెన్- 1 కాన్స్టెలేషన్ నెట్‌ వర్క్‌ శాటిలైట్లను ప్రయోగించడానికి ఇస్రో సహకారాన్ని తీసుకోనుంది వన్ వెబ్ (OneWeb) ఇంటర్నెట్. ఇది- బ్రిటన్ కు చెందిన కంపెనీ. బ్రిటన్ కు చెందిన నెట్ వర్క్ యాక్సెస్ అసోసియేట్స్ లిమిటెడ్ గ్రూప్ లో వన్ వెబ్ ఒకటి. మొత్తంగా 72 శాటిలైట్లను లో-ఎర్త్ ఆర్బిట్ లో ప్రవేశపెట్టడానికి ఇస్రోతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇదివరకు కూడా ఇదే కంపెనీకి చెందిన శాటిలైట్లను ప్రయోగించింది ఇస్రో.

 Isro all set to launch LVM3 rocket Carrying 36 OneWeb satellites on March 26th at 9am-Details here

తాజాగా 36 ఉపగ్రహాలను నింగిలోకి ప్రయోగించనుంది. దీనికోసం లాంచ్ వెహికల్ మార్క్-3 (LVM 3) ద్వారా వాటన్నింటినీ కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది ఇస్రో. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఆదివారం ఉదయం 9 గంటలకు ఆయా ఉపగ్రహాలను మోసుకుంటూ ఎల్వీఎం 3 నింగిలోకి దూసుకెళ్లనుంది. నిజానికి- ఈ ప్రాజెక్ట్ కోసం గతంలో రష్యా సహాయాన్ని కోరింది వన్ వెబ్ సంస్థ. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో- అంతరిక్ష కార్యకలాపాలు, సోయుజ్ రాకెట్ ప్రయోగాన్ని నిలిపివేసింది. దీనితో ఇస్రో సహకారాన్ని తీసుకుంటోంది.

గ్లోబల్ బ్రాడ్‌ బ్యాండ్ కవరేజీని మరింత మెరుగుపర్చడానికి 588 ఉపగ్రహాల ప్రారంభించాలంటూ వన్ వెబ్ సంస్థ తన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంది. ఉక్రెయిన్ తో సుదీర్ఘకాలంగా యుద్ధాన్ని కొనసాగుతున్న నేపథ్యంలో రష్యా తన అంతరిక్ష ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేయడం వల్ల కొంత మేర జాప్యం ఏర్పడింది. దీనితో వన్ వెబ్ కంపెనీ- ఇస్రోతో పాటు ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ తో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+