Chandrayaan 3:చంద్రయాన్ 3 కక్ష్యను మార్చిన ఇస్రో.. ఎందుకంటే..!
భారత అంతరిక్ష సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చంద్రయాన్ 3 ప్రయోగం చేపట్టింది. గత శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాలకు తిరుపతి జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్ 3 ను ప్రయోగించారు. ఈ చంద్రయాన్3 సంబంధించి ల్యాండర్ ఆగస్ట్ 23న చంద్రుడి దక్షిణ ధృవంపై దిగనుంది. చంద్రయాన్ 3 భూమి చుట్టూ ఉన్న 170X 36 వేల 500 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలో రాకెట్ ప్రవేశపెట్టారు.
సోమవారం పేలోడ్‌ను మండించి రెండోసారి కక్ష్య మార్పిడి చేశారు. చంద్రయాన్-3 ప్రస్తుతం 41,603 కి.మీ. x 226 కి.మీ. కక్ష్యలో భ్రమిస్తుంది. ఇలా ఇది 24 రోజుల పాటు భూమి చుట్టూ తిరుగుతూ క్రమంగా దూరంగా వెళ్తుతుంది. ఆ తర్వాత చంద్రుడి గురుత్వాకర్షణ క్షేత్రంలోకి వెళ్తోంది. చంద్రుడి గురుత్వాకర్షణ క్షేత్రంలోకి వెళ్లాక.. లూనార్ ఆర్బిట్ ఇన్సర్షన్ ప్రక్రియ ప్రారంభిస్తారు. ఆ తర్వాత చంద్రయాన్ వేగాన్ని తగ్గిస్తారు.

దీంతో చంద్రయాన్ 3 ని చంద్రుడి గురుత్వ ఆకర్షణ శక్తి ఆకర్షిస్తుంది. ఆ తర్వాత చంద్రుడి కక్ష్యలో కొద్ది రోజుల పాటు తిరుగుతుంది.ఆగస్టు 23న ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్, రోవర్‌తో కూడిన మాడ్యూల్ విడిపోయి.. చంద్రుడి ఉపరితలం వైపు వెళ్తుంది. ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధృవంలో దిగుతుంది. అప్పుడు ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వస్తుంది. ఇది చంద్రుడి ఉపరితలంపై పలు పరిశోధనలు చేయనుంది.
#Chandrayaan3 | "The second orbit-raising manoeuvre (Earth-bound apogee firing) is performed successfully. The spacecraft is now in 41603 km x 226 km orbit. The next firing is planned for tomorrow between 2 and 3 pm IST," says ISRO
— ANI (@ANI) July 17, 2023
(Photo - launch of the Chandrayaan-3 Mission… pic.twitter.com/N4h5SxC76V
ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వచ్చి చంద్రుడిపై దిగనుంది. చంద్రుని ఉపరితలంపై రోవర్ కేవలం డేటాను సేకరించడం కాకుండా.. ప్రజ్ఞాన్ అని పిలువబడే రోవర్ వెనుక చక్రాలు ISRO, జాతీయ చిహ్నం గుర్తులను చంద్రుడి ఉపరితలం ముద్రిస్తాయి. ఇస్రో చంద్రయాన్ 3 ప్రాజెక్టును రూ.615 కోట్లతో చేపట్టింది. చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ అయితే చంద్రుడి పైకి రోవర్లు పంపిన రష్యా, యూఎస్, చైనా సరసన భారత్ నిలవనుంది.












Click it and Unblock the Notifications