Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నేడే ఇస్రో మరో భారీ ప్రయోగం: ఒకేసారి ఏడు ఉపగ్రహాలతో నింగిలోకి పీఎస్ఎల్వీ సీ-56

న్యూఢిల్లీ: చంద్రయాన్-3 తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. పీఎస్ఎల్వీ సీ-56 రాకెట్ ప్రయోగం కోసం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లోసన్నాహాలు పూర్తయ్యాయి. ఆదివారం అంటే జులై 30న ఉదయం 6.30 గంటలకు మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి డీఎస్ఎల్వీ-ఎస్ఏఆర్ ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ-సీ56 ప్రయోగించనున్నారు.

ఈ నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలు శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పీఎస్ఎల్వీ సీ-56 రాకెట్ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. నేటి రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని స్వామివారిని ప్రార్థించారు.

ISRO: pslv c-56 will launch 7 satellites including singapore satellite on 30th july

కాగా, పీఎస్ఎల్వీ సీ-56 రాకెట్ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన డీఎస్-ఎస్ఏఆర్ శాటిలైట్ తోపాటు మరో ఆరు ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నట్లు ఇటీవల ఇస్రో వెల్లడించింది. సింగపూర్ ప్రభుత్వ ఏజెన్సీలకు ఉపగ్రహ ఛాయాచిత్రాల అవసరాల నిమిత్తం డీఎస్-ఎస్ఏఆర్ ను ప్రయోగిస్తున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు.

డీఎస్-ఎస్ఏఆర్ తోపాటుటెక్నాలజీ డెమాన్ స్ట్రేషన్ మైక్రో శాటిలైట్ వెలాక్స్-ఏఎం, ఎక్స్‌పెరిమెంటల్ శాటిలైట్ ఆర్కేడ్, 3యూ నానో శాటిలైట్ స్కూబ్-2, ఐవోటీ కనెక్టివ్ నానోశాటిలైట్ నూలయాన్, గలాసియా-2, ఓఆర్బీ-12 స్ప్రైడర్ శాటిలైట్లను కూడా నింగిలోకి పంపనుంది. కమర్షియల్ పీఎస్‌ఎల్వీ మిషన్‌లో భాగంగా న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్ (NSIL) తరఫున ఈ ఏడు ఉపగ్రహాలను ప్రయోగించనున్నట్లు ఇస్రో గత సోమవారం వెల్లడించింది.

జులై నెల 30న ఉదయం 6.30 గంటలకు శ్రీహరికోటలోని స్పేస్‌పోర్ట్‌ మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి డీఎస్‌ఎల్‌వీ-ఎస్ ఏఆర్ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ-సీ56 ప్రయోగించనుంది. డీఎస్‌-ఎస్‌ఏఆర్‌ ఉపగ్రహం బరువు 360 కిలోలు.

సింగపూర్‌కు చెందిన డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ (డీఎస్టీఏ), ఎస్టీ ఇంజినీరింగ్ భాగస్వామ్యంతో ఉపగ్రహాన్ని అభివృద్ధి చేసింది. ఈ ఉపగ్రహం పగలు-రాత్రి కవరేజీని అందివ్వనుంది. ఇది పూర్తి పోలారిమెట్రీ వద్ద 1 మీ-రిజల్యూషన్ వద్ద ఇమేజింగ్ చేయగలదు. సింగపూర్‌ ప్రభుత్వంలోని వివిధ ఏజెన్సీలకు సేవలందించనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+