నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ-58 : అంతరిక్ష రహస్యాల చేధన..!!
కొత్త సంవత్సరం ప్రారంభం వేళ షార్ మరో అరుదైన ఘనత సాధించింది. షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ సీ-58 రాకెట్ ప్రయోగం సక్సెస్ అయింది. సరిగ్గా 9.10 గంటలకు పీఎస్ఎల్వీ సీ-58 నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకుపోయింది. దీని ద్వారా అంతరిక్ష రహస్యాల కోసం ఎక్స్‌ఫోశాట్ రూపకల్పన. టెలిస్కోప్‌లా పనిచేస్తూ ఖగోళంలో బ్లాక్ హోల్స్, పాలపుంతలు, ఎక్స్ రే కిరణాలపై పరిశోధనకి ఉపయోగపడుతుంది.
కొత్త సంవత్సరం ప్రారంభం రోజున పీఎస్ఎల్వీ సిరీస్‌లో 60వ ప్రయోగం సక్సెస్ అయింది. షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ సీ-58 రాకెట్ ప్రయోగానికి ఆదివారం ఉదయం 8.10 గంటలకు కౌంటడౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రోజు పీఎస్ఎల్వీ సీ-58 నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకుపోయింది. కౌంట్ డౌన్ ప్రక్రియ 25 గంటల పాటు కొనసాగనుంది. 418 కిలోలు బరువు ఉండే ఎక్స్‌ఫోశాట్, కేరళ యూనివర్శిటీ విద్యార్ధులు రూపొందించిన విఐవై నానాశాట్‌లని శాస్త్రవేత్తలు రోదసీలోకి పంపారు.

భూ ఉపరితలానికి 650 కి.మీ ఎత్తులోని వృత్తాకార కక్ష్యలోకి శాటిలైట్లను పంపేలా డిజైన్ చేశారు. అంతరిక్ష రహస్యాల కోసం ఎక్స్‌ఫోశాట్ రూపకల్పన. టెలిస్కోప్‌లా పనిచేస్తూ ఖగోళంలో బ్లాక్ హోల్స్, పాల పుంతలు, ఎక్స్ రే కిరణాలపై పరిశోధనకి ఉపయోగపడుతుంది. ఎక్స్‌ఫోశాట్ జీవితకాలం అయిదేళ్లు. అంతరిక్షంలోని 50 కాంతి పుంజాలను ఈ ప్రయోగం ద్వారా పరిశీలిస్తారు. ఈ కాంతిపుంజాల్లో బ్లాక్‌హోల్, ఎక్స్‌రే జంట నక్షత్రాలు, యాక్టివ్‌గా ఉన్న పాలపుంత కేంద్రకాలు, న్యూట్రాన్ స్టార్స్, నాన్ థర్మల్ సూపర్‌నోవాల అవశేషాలు ఉన్నాయి. వాటిని ఈ శాటిలైట్ పరిశీలిస్తుంది.
Lift off🚀#PSLV58 #XPoSat pic.twitter.com/lymyinX1Z3
— ISRO InSight (@ISROSight) January 1, 2024
ఈ రాకెట్‌లో 480 కేజీల ఎక్స్‌పో శాట్ శాటిలైట్ ఉంది. దీన్ని రాకెట్.. భూమికి 500 నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలో ప్రవేశపెడుతుంది. ఎంతో తీక్షణమైన ఎక్స్ కిరణాల అధ్యయనానికి మొదటిసారిగా ఇస్రో ఈ పోలారిమెట్రి మిషన్ చేపడుతోంది. ఈ శాటిలైట్ 5 ఏళ్లు పనిచేస్తుంది. ప్రయోగం తరువాత 21 నిమిషాలకు ఎక్స్ పోశాట్ నిర్ణీత కక్షలోకి చేరుకుంది. రాకెట్ లోని నాలుగో స్టేజ్ అయిన పీఎస్ 4 అక్కడి నుంచి దిగువ కక్ష్యకు వస్తుంది. ఇస్రో 2024లో చేసిన తొలి ప్రయోగం సక్సెస్ కావటంతో శాస్త్రవేత్తలను పలువురు ప్రముఖుల అభినందించారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications