మార్స్, వీనస్‌పై ఐఏడీ ప్రయోగం, విజయవంతం
అంగారక గ్రహం, శుక్రుడిపై ల్యాండ్ చేయడానికి ఉపయోగించే ఐఏడీని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ విజయవంతంగా పరీక్షించింది. వాతావరణం ద్వారా అవరోహన చేసే వస్తువును ఏరోడైనమిక్‌గా తగ్గించడం కోసం ఇదీ డెవలప్ చేస్తున్నారు. తంబాలో గల టెర్ల నుంచి రాకెట్ పరీక్షించి చూశారు. 84 కిలోమీటర్ల ఎత్తు వరకు తీసుకెళ్లింది. గాలిలోకి వెళ్లి సౌండింగ్ రాకెట్ యొక్క పేలోడ్ భాగంతో వాతావరణంలో కలిసింది. ఐఏడీ సాంకేతికతను ప్రదర్శించడం మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం అని ఇస్రో తెలిపింది.

ఐఏడీ సింగిల్ స్టేజ్ రోహిణి నోస్ కోన్‌లో ఉంచబడిందని ఇస్రో తెలిపింది. టేకాఫ్ అయిన 100 సెకన్లలో నోస్ కోన్ వేరు చేయబడింది. 110 సెకన్లలో గ్యాస్ బాటిల్‌లో నిల్వ చేసిన కంప్రెస్ట్ నైట్రోజన్‌ను ఉపయోగించింది. పేలోడ్ టేకాఫ్ తర్వాత 200 సెకన్లలో మోటారు నుంచి వేరు చేయబడింది.
పరీక్షించే సమయంలో ఐఏడీ ఏరో డైనమిక్ డ్రాగ్.. పేలోడ్ వేగాన్ని క్రమపద్దతిలో తగ్గించింది. రికవరీ కోసం ఐఏడీ రూపొందించడం ఇదే తొలిసారి.. మిషన్ యొక్క అన్నీ లక్ష్యాలు విజయవంతంగా ప్రదర్శించబడ్డాయని ఇస్రో తెలిపింది.












Click it and Unblock the Notifications