వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇస్రో ఛైర్మన్ శివన్ నూ వదిలి పెట్టలేదు: ట్విట్టర్ ద్వారా నకిలీ సమాచారం.. ఆ వార్తలను నమ్మొద్దు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధక సంస్థ (ఇస్రో) ఛైర్మన్ కే శివన్ పేరు.. ప్రస్తుతం టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. రెండు నెలల కిందట చంద్రయాన్-2ను మిషన్ ను జాబిల్లి మీదికి ప్రయోగించినప్పటి నుంచీ ఆయన వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ వస్తున్నారు. చంద్రయాన్-2 జాబిల్లికి చేరువ అవుతున్న కొద్దీ శివన్ పేరు ప్రసార మాధ్యమాల్లో మారుమోగిపోతూ వస్తోంది. చంద్రయాన్-2 నుంచి విడివడిన విక్రమ్ ల్యాండర్ ఈ నెల 7వ తేదీన చందమమాపైకి దిగబోతూ అదృశ్యం కావడం.. ఈ సందర్భంగా కన్నీరు పెట్టుకున్న శివన్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అక్కున చేర్చుకుని ఓదార్చడంతో.. సోషల్ మీడియాలో మరింత ట్రెండ్ అయ్యారు ఇస్రో ఛైర్మన్.

ఆ మాత్రం పేరున్న వ్యక్తులు చాలు.. ట్విట్టరెట్టీలు చెలరేగిపోవడానికి. తాజాగా గుర్తు తెలియని వ్యక్తులు కైలాసవడివు శివన్ పేరు మీద ఓ నకిలీ ట్విట్టర్ అకౌంట్ ను తెరిచారు. శివన్ తన కుటుంబ సభ్యులతో ఉన్న ఫొటోను ఫీచర్ ఇమేజ్ గా ఉంచారు. ఇస్రో, చంద్రయాన్-2, విక్రమ్ ల్యాండర్ కు సంబంధించిన తమకు తోచిన సమాచారాన్ని అందులో పోస్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ నకిలీ వార్తలు కాస్త వైరల్ గా మారుతున్నాయి. ఇస్రో ఛైర్మన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన గానీ, సమాచారం గానీ వెలువడనప్పటికీ.. ఆయన పేరు మీద తెరిచిన ట్విట్టర్ అకౌంట్ ద్వారా నకిలీ వార్తలను వ్యాపింపజేస్తున్నారు. ఈ సమాచారం ఇస్రో శాస్త్రవేత్తల దృష్టికి చేరింది. దీనితో వారు వెంటనే స్పందించారు.

ISRO warns against fake K Sivan social media accounts that are spreading false news

తమ ఛైర్మన్ శివన్ పేరు మీద ఎలాంటి ట్విట్టర్ అకౌంట్ లేదని స్పష్టం చేశారు. కైలాసవడివు శివన్ పేరు మీద నమోదైన ట్విట్టర్ అకౌంట్ నుంచి షేర్ అయ్యే వార్తలు నకిలీవిగా గుర్తించాలని కోరారు. అలాంటి వార్తలతో తమకు సంబంధం లేదని తెలిపారు. ఈ మేరకు ఇస్రో శాస్త్రవేత్తలు ఓ ట్వీట్ చేశారు. తమ నుంచి ఎలాంటి అధికారికమైనవి లేదా ధృవీకరించిన సమాచారాన్ని తమ ట్విట్టర్ ద్వారా తెలియజేస్తామని అన్నారు. కే శివన్ పేరు మీద ట్విట్టర్ లో షేర్ అయ్యే సమాచారాన్ని నమ్మొద్దని కోరారు. ఎలాంటి సమాచారాన్నయినా తాము తమ సంస్థ పేరు మీద ఉన్న ట్విట్టర్ అకౌంట్ ద్వారానే వెల్లడిస్తామని, అది మాత్రమే అసలైనదిగా భావించాలని వారు కోరారు.

English summary
The Indian Space Research Organisation has issued a clarification Monday that the ISRO Chairman K Sivan has no personal accounts on any social media platform. In a statement, ISRO said, “It has been noted that social media accounts in the name of Kailasavadivoo Sivan (along with photographs of K. Sivan) is operational and active on social media platforms. This is to clarify that K. Sivan, Chairman, ISRO does not have any personal account on any social media platforms. Hence all the information on all such accounts are not authentic.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X