రేప్ నుండి తప్పించుకొన్నా, కానీ, సామాన్యురాలినైతే..
తాను సామాన్యుడి బిడ్డను అయితే ఈ కేసును ఇంత సీరియస్‌గా తీసుకొనేవారు కాదోమోనని ఐఎఎస్ అధికారి కూతురు అభిప్రాయపడ్డారు.
చండీఘడ్: తాను సామాన్యుడి బిడ్డను అయితే ఈ కేసును ఇంత సీరియస్‌గా తీసుకొనేవారు కాదోమోనని ఐఎఎస్ అధికారి కూతురు అభిప్రాయపడ్డారు.
బీజేపీ అధ్యక్షుడు సుభాష్ బరాలా కొడుకు వికాస్ చేతిలో వేధింపులు ఎదుర్కొన్న బాధితురాలు తాజాగా తన అభిప్రాయాలను ఫేస్‌బుక్‌లో వెల్లడించారు.
ఐఎఎస్ అధికారి కూతురైన ఆమె గత శుక్రవారం రాత్రి తాను ఎదుర్కొన్న భయానక అనుభవాన్ని వివరించారు.

ఆ రాత్రి నేను ఎంతో భయపడ్డాను. నా చేతులు వణికాయి. భయంతో వెన్ను జలధరించింది. ఒకవైపు విస్మయం...ఇంకో వైపు కళ్ళలో నీళ్ళు. నేను ఇంటికి వెళ్తానో లేదో తెలియని భయం నెలకొన్న విషయాన్ని ఆమె ఫేస్‌బుక్‌లో వెల్లడించారు.
గత రాత్రి చంఢీఘడ్ రోడ్డుమీద కిడ్నాప్ అయ్యేదాన్ని అంటూ ఆమె శనివారం పెట్టిన పోస్టును ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఎంతో మంది ఈ పోస్టును షేర్ చేసుకొంటున్నారు.
సామాన్యుడి కూతురిని కాకపోవడం తన నా అదృష్టమేమో ఎందుకంటే అలాంటి వీఐపీలను సామాన్యులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందా? నాపై రేప్, హత్య వంటి దుర్మార్గాలను జరగకపోవడం కూడ నా అదృష్టమే అనుకొంటా అంటూ ఆమె ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.
బలమైన రాజకీయ ప్రాబల్యమున్న కుటుంబాలకు చెందిన వ్యక్తులు వెంటాడి వేధించారని ఆమె ఆరోపించారు. ఆమెను వెంటాడి వేధించిన కేసులో బిజెపి చీఫ్ సుభాష్ బరాలా కొడుకు వికాస్ బరాలతో పాటు ఆయన స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. చంఢీగఢ్‌లో శుక్రవారం బాధితురాలు కారులో తన ఇంటికి వెళ్తుండగా మద్యం మత్తులో ఉణ్న వికాస్ అతని స్నేహితుడు ఆశిష్ తమ ఎస్‌యూవీ వాహనంలో వెంబడించారు.
కారును ఆపాలని పదేపదే హెచ్చరించారు. దీంతో ఆమె పోలీస్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసింది. పోలీసులు అక్కడికి చేరుకొనేలోపుగా ఆమెను నిలువరించి మరీ ఆ ఇద్దరూ వేధించారు.
దీంతో పోలీసులు సంఘటన స్థలంలోనే వికాస్‌ను, ఆశిష్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం పోలీసులు ఇద్దరిని బెయిల్‌పై విడుదల చేశారు. రాజకీయ ప్రాబల్యమున్న నిందితులపై పోలీసులు కిడ్నాప్ , అభియోగాలు నమోదు చేయకపోవడంతో హర్యాణాలోని బిజెపి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications