అత్తగారి కోసం ఉద్యోగం వదలమన్న భర్త.. భార్య చేసిన పనికి షాకవ్వాల్సిందే!

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ ఐటీ జంట విడాకుల ఉదంతం తీవ్ర చర్చకు దారితీసింది. అత్తగారిని చూసుకోవడం కోసం భార్య తన ఉద్యోగాన్ని వదులుకోవాలని భర్త ఒత్తిడి చేయడం, అందుకు ఆమె నిరాకరించడంతో వారి బంధం విడాకుల వరకు వెళ్లిన ఈ ఘటనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో భారతీయ కుటుంబ వ్యవస్థలో లింగ వివక్ష, బాధ్యతల పంపిణీపై మరోసారి చర్చ మొదలైంది. స్కూల్ నాటి నుంచి స్నేహితులుగా ఉండి, పెళ్లి చేసుకుని, కెరీర్‌లో అద్భుతంగా రాణిస్తున్న ఒక సాఫ్ట్‌వేర్ జంట మధ్య 'ఉద్యోగం' చిచ్చు పెట్టింది. చివరకు వారిద్దరూ విడాకులు తీసుకున్నారంటూ 'ఎక్స్' (గతంలో ట్విట్టర్)లో ఓ యూజర్ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.

ఆదర్శ దంపతులు.. ఆపై విభేదాలు
సదరు పోస్ట్ ప్రకారం.. ఆ భార్యాభర్తలిద్దరూ ఇంజనీర్లు. వారికి ఇద్దరు పిల్లలు, ఆర్థిక స్థిరత్వం ఉన్నాయి. భార్య ఎంతో కష్టపడే స్వభావం కలది. గర్భవతిగా ఉన్న సమయంలో కూడా ఆమె 9వ నెల వరకు ఆఫీసుకి వెళ్లేది. కేవలం ప్రసవం తర్వాత 6 నెలలు మినహా ఆమె ఎప్పుడూ విరామం తీసుకోలేదు. రెండో ప్రసవం తర్వాత కొత్త టెక్నాలజీ నేర్చుకుని, తన భర్త కంటే ఎక్కువ జీతం పొందే స్థాయికి ఎదిగింది.

IT Couple Divorce Story IT Woman Quits Marriage Over Husband Demand to Leave Job for Mother-in-Law

వివాదానికి కారణం ఏంటి?
అంత వరకు బాగానే ఉన్నా.. అత్తగారికి ఆరోగ్యం బాగోలేనప్పుడు అసలు సమస్య మొదలైంది. అనారోగ్యంతో ఉన్న తన తల్లిని పూర్తి సమయం చూసుకోవడం కోసం భార్య తన హై-పెయిడ్ (అధిక జీతం) ఉద్యోగాన్ని వదిలేయాలని భర్త పట్టుబట్టాడు. దానికి ఆమె నిరాకరించడంతో, భర్త, అతని కుటుంబ సభ్యులు ఆమెను మానసికంగా వేధించడం ప్రారంభించారు.

మహిళ తీసుకున్న సాహసోపేత నిర్ణయం
వారి వేధింపులు భరించలేక ఆమె తన పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. తన తల్లిని చూసుకోవాలనుకుంటే ఆమెను తీసుకుని తన పుట్టింటికి రావచ్చని, అక్కడ తన తల్లిదండ్రులతో కలిసి ఆమె ఎంతకాలమైనా ఉండవచ్చని భర్తకు ఆఫర్ ఇచ్చింది. అయితే దీనికి అంగీకరించని భర్త, ఆమెకు విడాకుల నోటీసులు పంపాడు. చివరకు ఆ మహిళ కూడా వెనక్కి తగ్గకుండా విడాకులకు అప్లై చేసింది.

నెటిజన్ల రియాక్షన్: "డబ్బు కంటే అహమే ఎక్కువ"
ఈ పోస్ట్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. మెజారిటీ ప్రజలు మహిళ నిర్ణయానికే మద్దతు తెలుపుతున్నారు. ఒక యూజర్ స్పందిస్తూ.. "వారికేమీ డబ్బు ఇబ్బంది లేదు, కావాలంటే 24 గంటలు చూసుకునే కేర్ టేకర్‌ను నియమించుకోవచ్చు. కానీ ఇక్కడ సమస్య సేవ కాదు.. భార్య తనకంటే ఎక్కువ సంపాదిస్తోందన్న భర్త అహంకారం" అని పేర్కొన్నారు. మరో యూజర్ స్పందిస్తూ "ఒకవేళ భార్య తల్లికి ఆరోగ్యం బాగోలేకపోతే, భర్త తన ఉద్యోగాన్ని వదిలేసి చూసుకుంటాడా? ఖచ్చితంగా లేదు" అని ప్రశ్నించారు. ఈ వ్యవస్థలో మహిళ ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా, తన స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవాలనుకున్నప్పుడు ఆమెను పనికిరాని దానిలా చూస్తారని పోస్ట్ చేసిన వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+