Exit Polls: ఆ పార్టీకి సున్నా సీట్లు ?, 10 ఏళ్లు వరుసగా అధికారం, అమ్మ పార్టీ గోవిందా గోవింద !
తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలిపోవడం, ఆ పార్టీకి చెందిన నాయకులు వేర్వేరుగా పోటీ చెయ్యడంతో డీఎంకే పార్టీకి కలిసి వచ్చిందని తమిళ తంబీలు అంటున్నారు. ఇక తమిళనాడులో సీఎం స్టాలిన్ మార్క్ రాజకీయం పని చెయ్యడంతో ఎక్కువ ఎంపీ సీట్లు డీఎంకే సొంతం చేసుకుంటుందని ప్రజలు అంటున్నారు. సర్వేలు ఎన్ని చెప్పినా ఫలితాలు మాత్రం డీఎంకేకి అనుకూలంగా ఉంటాయని తమిళ ప్రజలు అంటున్నారు.
మరో వైపు తమిళనాడులో బీజేపీకి రోజులు కలిసి వస్తున్నాయని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. తమిళనాడులో కనీసం కొన్ని సీట్లు అయినా సొంతం చేసుకోవాలని మాజీ సీఎంలు ఎడప్పాడి పళనిస్వామి, ఓ. పన్నీర్ సెల్వం అనేక ప్రయత్నాలు చేశారు. అయితే తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ మాత్రం అన్నాడీఎంకే పార్టీకి చెందిన రెండు వర్గాలకు చుక్కలు చూపించిందని తెలిసింది. జూన్ 4వ తేదీన తమిళ ప్రజలు ఎవరిని ఆధరించారు అనే విషయం పక్కాగా తెలిసిపోతుంది.

అన్నాడీఎంకే పార్టీ అధినేత్రి జయలలిత హవాతో వరుసగా రెండు సార్టీ ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఐదు సంవత్సరాలు జయలలిత సీఎంగా ఉన్నారు. తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండో సారీ జయలలిత హవాతో మరోసారి అన్నాడీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చింది. తరవాత జయలలిత అనారోగ్యంతో చనిపోవడం, సీఎం పదవి కోసం శశికళ వర్గం, పన్నీర్ సెల్వం గొడవ పడటంతో ఆ పార్టీ రెండుగా చీలిపోయింది.
తరువాత ఎడప్పాడి పళనిస్వామి సీఎం కావడం, కొంతకాలం తరువాత ఢిల్లీ పెద్దలు రాజీ చెయ్యడంతో పన్నీర్ సెల్వం వారితో చేతులు కలపడం జరిగింది. అయితే అప్పటికే అన్నాడీఎంకే పార్టీకి జరగరాని నష్టం జరిగిపోంది. తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వచ్చిన తరువాత మరోసారి ఎడప్పాడి పళనిస్వామి, పన్నీరు సెల్వం వర్గాలు విడిపోయాయి. దాని ఫలితంగా తమిళనాడులో డీఎంకే పార్టీకి ఎదురేలేకుండా పోయింది.

అన్నాడీఎంకే వర్గపోరు ఫలితంగా ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే పార్టీకి సుమారు 36 నుంచి 39 సీట్లు వస్తాయని కొన్ని సర్వేలు చెబుతుంటే బీజేపీ కూటమికి 1 నుంచి 3 సీట్లు వస్తాయని అంటున్నారు. ఇక అన్నాడీఎంకేకి సున్నా నుంచి 1 సీటు వచ్చే అవకాశం ఉందని కొన్ని సర్వేలు చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. మొత్తం మీద అన్నాడీఎంకే పార్టీకి సున్నా సీట్లు వస్తే తమిళనాడు చరిత్రలో అమ్మ పార్టీకి ఓ మచ్చ అని ఆమె ఆ పార్టీ అభిమానులు అంటున్నారు.
-
Noida jinx: అక్కడికి వెళ్తే పదవి పోయినట్లేనా ? సెంటిమెంట్ పై మోడీ కామెంట్స్..! -
తెరపై స్టార్ హీరో + దర్శకుడు: విజయ్ వద్దనుకున్న చోట.. -
రేవంత్ కు కేంద్రం బంపర్ బొనాంజా , 2028 తర్వాతా - మారుతున్న లెక్కలు..!! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది!












Click it and Unblock the Notifications